రిస్క్ తీసుకుంటున్న నాగచైతన్య.. తక్కువైనా ఓకే?

ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్ని కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడగా థియేటర్లు కూడా బంద్ చేశారు.దీంతో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు విడుదల వాయిదా పడగా ఓటీటీ లో కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నాయి.

 Fifty Percent Approvals Are Release Movie Love Story Naga Chaitanya, Sai Pallavi-TeluguStop.com

చాలావరకు విడుదలకున్న సినిమాలన్నీ థియేటర్లు తెరుచుకున్న వెంటనే విడుదల చేయనున్నారు.ఇక ఈ నేపథ్యంలో నాగచైతన్య సినిమా కూడా అప్పుడే విడుదల కానుంది.

థియేటర్లు 100% తో కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీ తో ఓపెన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక నాగ చైతన్య తన సినిమాను కూడా పూర్తి స్థాయి వరకు ఎదురు చూడకుండా 50 శాతానికైనా సరే విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది.

Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi, Tollywood-Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ.ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.నారాయణ దాస్, పి రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలని గతంలోనే ప్రకటించగా అప్పుడే కోవిడ్ వ్యాపించడంతో విడుదల వాయిదా వేశారు.

Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi, Tollywood-Movie

దీంతో ప్రస్తుతం ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని సినీ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విడుదల కాగా సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రశ్నలు కూడా ఎదురవడంతో ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారట.ఇక ఈ నెల ఆఖరి వారంలో లేదా వచ్చే నెల లో థియేటర్లు 50 శాతం తో తెరుచుకున్న వెంటనే విడుదల చేయనున్నారు.

మొత్తానికి ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య తక్కువ శాతం అయినా సరే రిస్కు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.సరైన సక్సెస్ లు లేకపోవడంతో ఈ సినిమా నాగచైతన్య కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube