వైరల్: చిరుత, పైథాన్ మధ్య భీకర పోరాటం.. గెలుపు ఎవరిదంటే..?!

Fierce Fight Between Leopard And Python Who Will Win

ప్రతి నిత్యం సోషల్ మీడియాలో జంతువులకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు కూడా జంతువుల వీడియోలను బాగా లైక్ చేస్తున్నారు.

 Fierce Fight Between Leopard And Python Who Will Win-TeluguStop.com

ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తుంటే భలే ఫన్నీగా అనిపిస్తాయి.అలాగే కొన్ని కొన్ని సార్లు ఒక జంతువు వేరొక జంతువును వేటాడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

వేట అన్నాక ఎదో ఒక జంతువు ప్రాణాలు పోగొట్టుకోవడమే తప్పనిసరి కదా.ఈ క్రమంలోనే ఇప్పుడు రెండు జంతువులకు మధ్య జరిగిన బీకర పోరుకు సంబందించిన వీడియో ఒకటి బాగా వైరల్ గా మారింది.చిరుత, పైథాన్ రెండు గొడవపడితే ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు.

 Fierce Fight Between Leopard And Python Who Will Win-వైరల్: చిరుత, పైథాన్ మధ్య భీకర పోరాటం.. గెలుపు ఎవరిదంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చిరుత పులి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదనే చెప్పాలి.

ఎందుకంటే చిరుత వేగానికి ఏ జంతువు అయినా సరే చతికిలపడాలిసిందే.ఎందుకంటే.

చిరుత ఒక క్రూరమైన జంతువు.ఇక పైథాన్ విషయానికి వస్తే అది సరీసృపాలలో ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు.

ఏ జంతువునైనా సరే అమాంతం ఊపిరి ఆడకుండా చుట్టేసి మింగేస్తుంది.మరి ఈ రెండు జంతువులు ఒకదానితో ఒకటి తలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ నది తీర ప్రాంతంలో ఒక పెద్ద నల్లటి రంగు గల పైథాన్ సేద తీరడం మనం చూడవచ్చు.అయితే ఆ పైథాన్ ను చుసిన చిరుత దాని దగ్గరకు వచ్చి ఒక కొంతసేపు తీక్షణంగా చూడడం మొదలుపెట్టింది.కొద్దిసేపు అయ్యాక అదును చూసి పైథాన్ తలను ఒక్కసారిగా నోటితో పట్టుకుంది.

ఇంకా పైథాన్ పని అయిపోయినట్లే అనుకున్నారు అంతా.కానీ పైథాన్ మాత్రం చిరుత పట్టు నుంచి విడిపించుకుని పక్కనే ఉన్న నదిలోకి జారుకుంది.

ఎలాగయితే చిరుత నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది.ఈ వీడియో పాతదే అయినాగానీ మరొక్కసారి నెట్టింట వైరల్‌ అయింది.

#Chettah #Phyton

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube