కండోమ్స్ వాడమని చెబితే సిగ్గు పడుతున్నారంటున్న నటి గాయత్రి గుప్తా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన టువంటి “ఫిదా” అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి గాయత్రీ గుప్తా గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలతో కాకుండా ఎక్కువగా వివాదాలు, గాసిప్స్ వంటి వాటితోనే చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యింది.

 Gayathri Guptha, Fidaa Movie Fame Actress, Aids Disease Awareness, Tollywood Ac-TeluguStop.com

అయితే అప్పట్లో ఈ అమ్మడు సినీ పరిశ్రమలో తెలుగు యువతులకు దర్శక, నిర్మాతలు ఆఫర్లు ఇవ్వడం లేదంటూ పెద్ద రచ్చ చేసింది.అయితే తాజాగా గాయత్రి గుప్తా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

 ఇందులో భాగంగా పలుఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో తన జీవితంలో చూసినటువంటి ఓ సంఘటన గురించి తెలిపింది.

తాను నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో కాపలాదారుడుగా పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తి తండ్రి మహమ్మారి ఎయిడ్స్ వ్యాది బారిన పడి మరణించాడని అయితే ఆ విషయం తనకు అప్పుడే తెలిసిందని తెలిపింది. దాంతో ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం కోసం అప్పట్లో అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలనుకున్నానని కానీ ఇతర కారణాల వల్ల ఇప్పటివరకు అది సాధ్య పడలేదని చెప్పుకొచ్చింది.

అలాగే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎయిడ్స్ వ్యాధి గురించి కొంతమేర అవగాహన కల్పించానని కూడా చెప్పుకొచ్చింది.

అలాగే ప్రస్తుతం కొందరికి నిరోధుల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో ఇలాంటి హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని తెలిపింది.

కాగా అప్పట్లో ఈ కండోమ్స్ వాడమని సూచిస్తే సిగ్గుపడే వాళ్ళని, కానీ అందులో సిగ్గుపడాల్సినంత విషయం ఏమీ లేదని అలాగే కండోమ్స్ వాడడం వల్ల పలు వ్యాధులు దరికి రాకుండా ఉంటాయని చెప్పుకొచ్చింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు తెలుగులో ఫిదా, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, ఐస్ క్రీమ్ 2, తదితర చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సిరీస్ ల వైపు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube