ఇంట్రస్టింగ్ స్టోరీ : 44ఏళ్ల కింద జరిగిన హత్య మిస్టరీని బయటపెట్టిన మేడిచెట్టు...

44ఏళ్ల క్రింద జరిగిన హత్యను బయటపెట్టింది ఒక మేడి చెట్టు… ఆశ్చర్యంగా ఉన్నప్పటికి నిజం.మేడిపండు చూడమేలిమై ఉండు,పొట్ట విప్పి చూడ పురుగులుండు అని మనం పద్యం పాడుకున్నాం గుర్తుందా.

 Ficus Racemosa Tree Revalve Murder Mystery-TeluguStop.com

కానీ చనిపోయిన శవం పొట్టలోని మేడిపండు విత్తై,చెట్టై ఆఖరికి ఆ చనిపోయిన వ్యక్తి ఆచూకీ అందించింది.అసలేం జరిగింది.మనిషికి,మేడిచెట్టుకి సంబంధం ఏంటో తెలియాలంటే చదవాల్సిందే…ఇంట్రస్టింగ్ స్టోరీ…

1974లో గ్రీస్, టర్కీల మధ్య గొడవలు జరిగాయి.గ్రీక్ సైప్రోయిట్స్‌, టర్కిష్‌ సైప్రోయిట్స్‌ దళాల మధ్య సాగిన యుద్ధంలో అహ్మద్‌ హెర్గూన్‌ అనే టర్కీ జవాను హతమయ్యాడు.శత్రువులు అతనితోపాటు మరో ఇద్దరిని మూరుమూల కొండల్లోని గుహలోకి తీసుకెళ్లి లోపల బాంబులు పెట్టి పేల్చేశారు.పేలుళ్లలో గుహ పైకప్పుకు రంధ్రం పడింది.మృతుల ఆచూకీ తర్వాత ఎవరికీ తెలియకుండా పోయింది.కాలం గడిచింది.

తర్వాత ఆ గుహలో మేడిమొక్క మొలిచింది.మొక్క చెట్టైంది…గుహలో చెట్టెలా పెరిగింది అని డౌటా.

బాంబు పేలుడుతో ఏర్పడిన రంధ్రం నుంచి సూర్యకాంతి సోకడంతో వలనే ఆ చెట్టు పెరిగింది.ఆ ప్రాంతంలో మేడి చెట్లు లేవు.

కానీ గుహపై ఒకే ఒక్క మేడి చెట్టు కనిపించడం ఒక వృక్ష పరిశోధకుణ్ని ఆశ్చర్యానికి గురిచేసింది.చెట్టు మొదళ్లను వెతుక్కుంటూ గుహలోపలికి వెళ్లాడు.

అక్కడే అసలు విషయం బయటపడింది.అదేంటంటే.

మొదల్లో తవ్వగా మానవ కంకాళాలు బయటపడ్డాయి…వాటిని బయటికి తీసి పరిశీలించి చూడగా యుద్ధంలో చనిపోయిన వారివి అని తేలింది.దాంతో అహ్మద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

తర్వాత శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు.యుద్ధంలో చనిపోవడానికి ముందు అహ్మద్ మేడిపళ్లు తిన్నాడని, అతని కడుపులోంచి గింజ మొలకెత్తిందని తేల్చారు.

అహ్మద్ మృతదేహ డీఎన్ఏ అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోలింది.అహ్మద్ ఆచూకీ కోసం చాలా కాలం ఎదురు చూశామని, చివరికి మేడిచెట్టు తమకు సాయం చేసిందని అతని సోదరి 87 ఏళ్ల మునూర్ ఉద్వేగంగా చెప్పింది.

ఇదంతా బయటపడింది 2011లో…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube