గర్భంపై ఉండే వింత వింత అపోహలు - వాస్తవాలు  

Few Weird Myths And Truths About Pregnancy -

ఒక అమ్మాయి మొదటిసారి గర్భవతి అయితే చాలు, పక్కింటి ఆంటీలు, ఎదురింటి బామ్మలు, లేనిపోనివి చెబుతుంటారు .వారు నమ్ముతున్న అపోహలే ఈ అమ్మాయికి కూడా పరిచయం చేస్తారు.

అలాంటి వింత వింత అపోహాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం.

Few Weird Myths And Truths About Pregnancy-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అలాగే నిజాలు ఏంటో చూద్దాం.

* ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోకూడదు, తీసుకుంటే బిడ్డ నల్లగా పడుతుందని, కొబ్బరినీళ్ళు ఎక్కువగా తాగితే తెల్లగా పుడుతుందని చెబుతారు కొందరు.

కాని నిజానికి అలాంటిదేమి జరగదు.చర్మం యొక్క రంగు జీన్స్ మీదే ఆధారపడి ఉంటుంది.

* ప్రగ్నెన్సి టైమ్ లో సెక్స్ వలన బిడ్డకి ప్రమాదం అని కూడా ఓ అపోహ ప్రచారంలో ఉంది.నిజానికి బిడ్డ చాలా సురక్షితంగా ఉంటుంది.

తన దాకా ఏది చేరదు.మొదటి మూడు నెలలు సెక్స్ కి దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతారు.

ఆ తరువాత స్త్రీకి కామవాంఛ కలిగితే, కొన్ని యాంగిల్స్, ఆమె కంఫర్ట్ ని బట్టే శృంగారం చేయవచ్చు.కాని స్త్రీ ఈ సమయంలో సున్నితంగా ఉంటుంది కాబట్టి శృంగారానికి దూరంగా ఉండటమే మంచిది.

అంతేతప్ప, సెక్స్ వలన బిడ్డకి డైరెక్టరుగా ఎలాంటి ప్రమాదం లేదు.

* పాపాయ తింటే, గర్భానికి ప్రమాదం అని చెబుతారు.

కాని పాపాయ తట్టుకోలేనంతగా తింటే తప్ప, అలాంటిదేమి జరగదు.

* స్వీట్లు తినకూడదు గర్భవతులు అని చెప్పేవారు లేకపోలేదు.

కాని చాకోలేట్ (క్యాండి కాదు, ప్యూర్ చాకోలేట్) గర్భవతి వారానికి ఐదార్లు సార్లు తింటే హై బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.అలాగని, ఏ స్వీట్ పడితే ఆ స్వీట్ తినకూడదు.

* పక్కమీదే తప్ప, వెన్ను మీద పడుకోకూడదు అనే అపోహ కూడా ఉంది.నిజానికి, వెన్ను మీద పడుకోవడం వలన బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేదు.

కాని ఎడమ పక్కకి పడుకుంటే లాభాలున్నాయి.

* ప్రెగ్నెన్సిలో సీ ఫుడ్ (చేపలు అవి ఇవి) తినకూడదు అనడం కూడా అపోహే.

నిజానికి ఒమెగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ కలిగిన సీ ఫుడ్ తింటే బాగా తెలివైన బిడ్డలు పుడతారని సైన్స్ చెబుతోంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test