ప్రస్తుతం ఒకప క్క కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంటే, మరోపక్క పలు ఆసుపత్రుల యాజమాన్యాలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు.తాజాగా నెలలు నిండిన గర్భిణీ కి నొప్పులు రావడంతో చికిత్స కోసం అని వెళ్తే ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చేర్చుకోమంటూ చేతులెత్తేయడంతో చివరికి వైద్యం అందక గర్భంలోనే శిశువు మరణించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో లోని హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే ఇటీవల హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ మహిళ కి పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే వైద్యం అందించడానికి తమ వద్ద సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో హైదరాబాదులోని పలు ప్రైవేట్ ఆ ఆస్పత్రులకు స్థానిక వైద్యులు సిఫార్సు చేశారు.
దీంతో కుటుంబ సభ్యులు గర్భిణి ని తీసుకొని చికిత్సకోసం ప్రైవేటు ఆసుపత్రులను తిరిగినప్పటికీ వారు పలు ఇతర సాకులు చెబుతూ వైద్యం అందించడానికి నిరాకరించారు.దీంతో చేసేదేమీ లేక గర్భిణీ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి వైద్యం కోసం సహాయం అందించాలని కోరారు.
రంగంలోకి దిగిన టువంటి పోలీసులు గర్భిణీ ని చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.దాంతో శిశువు కడుపులోనే మృతి చెందగా గర్భిణి మాత్రం ప్రాణాలతో బయట పడింది.
గర్భిణీ కోలుకున్న తర్వాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.నవ మాసాలు మోసిన బిడ్డ చికిత్స అందక పురిట్లోనే ప్రాణాలు కోల్పోవడంతో గర్భిణీ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.