అమెరికాలో నిరుద్యోగులకు పండగలాంటి వార్త...గంటకు జీతం రూ....

కరోనా కారణంగా అమెరికాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్నాయో అందరికి తెలిసిందే.ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది అమెరికన్స్ ప్రస్తుతం నిరుద్యోగులుగా మారి ఆర్ధిక పరమైన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 Festive News For The Unemployed In America Salary Per Hour Is Rs , America, Unem-TeluguStop.com

ఒక పక్క కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.దాంతో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్న అమెరికన్స్ కు అమెజాన్ సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది.

తమ సంస్థలో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని త్వరలో వాటి భర్తీ చేపడుతామని ప్రకటించింది.

అసలే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న అమెరికన్స్ కు అమెజాన్ తాజా ప్రకటన భారీ ఊరటను ఇచ్చిందనే చెప్పాలి.

త్వరలో అమెరికాలో హాలిడే సీజన్ వస్తోందని, ఆ సమయంలో తమ సంస్థకు కొనుగోలుదారుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య తప్పనిసరిగా పెంచాలని అమెరికా వ్యాప్తంగా లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేపడుతామని తెలిపింది.అయితే ఈ ఉద్యోగాలు అన్నీ తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టనున్నారని ప్రకటించింది.

ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే సుమారు 24 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టుగా తెలిపింది.

ఇదిలాఉంటే ఈ ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సింది కేవలం కస్టమర్లు ఇచ్చిన ఆర్డర్లు వారి ఇంటికి తీసుకు వెళ్లి ఇవ్వడమే.

కస్టమర్ల విజ్ఞప్తి మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎంతో మంది కొనుగోలు దారులు తమకు సరైన సమయంలో వస్తువులు డెలివరీ అవ్వడంలేదని అంటున్నారని వారికోసమే ఈ నిర్ణయం తీసుకున్నాట్టుగా తెలిపింది.తాత్కాలికంగా ఏర్పడిన ఉద్యోగాలని చిన్న చూపు చూడద్దని ఈ ఉద్యోగంలో చేరిన వారికి గంటకు 18 డాలర్లు వేతనం ఇస్తామని ప్రకటించింది అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1350.అంతేకాకుండా ఉద్యోగులు వారి పనిచేసే స్థలం, షిఫ్ట్ లు బట్టి మరో మూడు డాలర్లు అదనంగా పొందవచ్చునని అలాగే సైనింగ్ ఆన్ బోనస్ కింద మరో 3వేల డాలర్లు ఇస్తామని సంస్థ అధికారులు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube