భారత్ లో ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది.ప్రముఖ కార్ల కంపెనీలు కళ్ళు చెదిరే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి.ఇక టాటా కార్లపై దాదాపుగా రూ.80 వేల వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభించనున్నాయి.టాటా కంపెనీకి చెందిన కార్లు ఏమిటో చూద్దాం.
టాటా అల్ట్రోజ్ (డీసీఏ):( Tata Altroz ) ఈ కారుపై కన్జ్యూమర్ స్కీమ్ కింద రూ.15000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10000, మొత్తం రూ.25వేల డిస్కౌంట్ తో ఈ కారును సొంతం చేసుకోవచ్చు.డీజిల్ వేరియంట్ పై కూడా సేమ్ డిస్కౌంట్ లభించనుంది.
టాటా సఫారీ:( Tata Safari ) టాటా మోటార్స్ సఫారీ MT వేరియంట్ పై రూ.25వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది.సఫారీ AT ( NON-ADAS ) వెర్షన్ పై రూ.25 వేల ఎక్సేంజ్ డిస్కౌంట్, సఫారీ AT(ADAS) వేరియంట్ పై రూ.50 వేల ప్లస్ కన్జ్యూమర్ స్కీమ్ తో పాటు రూ.25వేల ఎక్సేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.మొత్తానికి ఈ వాహనంపై రూ.75 వేల డిస్కౌంట్ పొందవచ్చు.
టాటా టియాగో: ( Tata Tiago )టాటా మోటార్స్, టియాగో CNG సింగిల్ సిలిండర్ కారుపై రూ.30 వేల కన్జ్యూమర్ స్కీమ్ తో పాటు రూ.20 వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.టియాగో CNG ట్విన్ సిలిండర్ ఉండే కారుపై కూడా ఇదే ఆఫర్ ఉంది.
టాటా టిగోర్: ( Tata Tigor )టిగొర్ CNG సింగిల్ సిలిండర్ వేరియంట్ పై రూ.30 వేల కన్జ్యూమర్ స్కీమ్ తో పాటు రూ.20 వేల ఎక్సేంజ్ డిస్కౌంట్ ఉంది.ట్విన్ సిలిండర్ వేరియంట్ పై కూడా ఇదే ఆఫర్ ఉండనుంది.