టీడీపీలో టికెట్ల కోలాహలం ! సర్వేలనే నమ్ముకున్న బాబు  

ఏపీ అధికార పార్టీ టీడీపీకి కొద్దిరోజుల నుంచి ఊపు పెరిగినట్టు కనిపించడంతో… టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లతో పాటు కొత్త వారు కూడా టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ బలా బలాలు ప్రదర్శిస్తూ… చంద్రబాబు దగ్గర బలం నిరూపించుకునేందుకు సిద్ధం అయిపోతున్నారు.

Festival In TDP Candidates Tickets Distribution AP-Janasena Party Pawan Kalyan Janasena Tdp List Ap Ycp Ys Jagan

Festival In TDP Candidates Tickets Distribution In AP

ఈ నేపథ్యంలో వారంతా అమరావతి చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. అయితే ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా…. చంద్రబాబు మాత్రం ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే విషయంలో స్పష్టమైన క్లారిటీతో ఉన్నాడు. ఏ నియోజకవర్గంలో ఎవరికి సీటు ఇస్తే గెలుపు గుర్రం అవుతారనే విషయంపై ఇప్పటికే చంద్రబాబు అనేక సర్వేలు పూర్తి చేయించారు. ఇంకా చేయిస్తున్నారు.

ఇక అమరావతి చుట్టూ చక్కెర్లు కొడుతున్న నాయకులను పిలిచి మరీ… మీరెవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే… ఎందుకంటే మీ జాతకం మొత్తం నాదగ్గర ఉంది. అందుకే నా దగ్గరికి మీరు రావాల్సిన పనిలేదు.. గెలుస్తారని నమ్మితే తప్పకుండా పిలిచి టికెట్ ఇస్తానని చెప్పేస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఇదే వర్తిస్తుందని బాబు గారు చెప్పకనే చెబుతున్నారు.

గతంలో కూడా చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా నుంచి ఈ పోటీ కాస్త ఎక్కువగా ఉండడంతో… ఈ మధ్యనే…. ఐవీఆర్‌ఎస్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం) పేరుతో సర్వే చేపట్టారు. ఇంకో వైపు ఎప్పటికప్పుడు అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, శంకర్‌యాదవ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Festival In TDP Candidates Tickets Distribution AP-Janasena Party Pawan Kalyan Janasena Tdp List Ap Ycp Ys Jagan

పలమనేరులో అమర్‌నాథ్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని చంద్రబాబుకు నివేదిక అందిందంట. ఇప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో పాలుపోని దుస్థితిలో ఉండిపోయాడు చంద్రబాబు. ఆ విధంగానే చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభపై కూడా వ్యతిరేకత ఉందని తేలిందంట. స్థానికులకు అందుబాటులో ఉండడం లేదనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అనారోగ్య కారణంతో ఈసారి టికెట్‌ ఇవ్వటం లేదని తేలిపోయింది. కృష్ణారెడ్డి భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్‌రెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఏదో ఒక బలమైన రీజన్ కనబడుతూ… టికెట్ల కేటాయింపుపై చంద్రబాబు కు తలనొప్పులు తెస్తున్నాయి.