ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ బుక్..ధర కేవలం 20లక్షలే  

Ferrari Collectible Art Book Will Cost You Over Rs 20 Lakh-

ఒక బుక్ రేట్ ఎంతుంటుంది వందల్లో ఉంటుంది.మహా అంటే వేలల్లో ఉంటుంది.

కాని లక్షల్లో ఖరీదు చేసే పుస్తకాన్ని చూసారా?కానీ ఈ పుస్తకం ఖరీదు అక్షరాలా ఇరవై లక్షల రూపాయలు.అంత రేట్ పెట్టి కొనడానికి ఆ పుస్తకంలో ఏముంది.

Ferrari Collectible Art Book Will Cost You Over Rs 20 Lakh- Telugu Viral News Ferrari Collectible Art Book Will Cost You Over Rs 20 Lakh--Ferrari Collectible Art Book Will Cost You Over Rs 20 Lakh-

యమధర్మరాజు దగ్గర ఉండే భవిష్యవాణి కాదు కదా అనుకుంటున్నారా.నిజంగా భవిష్యవాణి ఉంటే దాని ఖరీదు ఎంతుంటుందో కాని ఈ పుస్తకం మాత్రం ప్రపంచంలోనే విలువైన పుస్తకంగా పేరుగాంచింది.

ఆ పుస్తకమే “ఫెరారి”

ఫెరారి ఇది కారు కదా.అవును ఫెరారి కార్ల కంపెని ఇటీవల ఒక బుక్ రిలీజ్ చేసింది.

ఆ కార్ల్ లానే ఆ పుస్తకం కూడా చాలా కాస్ట్లీ.ఇటలీకి చెందిన ఫెరారి కార్ల కంపెని ఆ కార్ల చరిత్ర గురించి సమగ్ర సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందు పరిచి అమ్మకానికి పెట్టారు.

మంచి ఫోటోలతో సహా ముద్రించామని చెప్తున్నా ఈ పుస్తకం ఖరీదు 20లక్షలు.మొత్తం 1,947 పుస్తకాలను ముద్రించారరు.కానీ వాటిల్లో కేవలం 250 పుస్తకాలకు మత్రమే పైన చెప్పిన రేటు వర్తిస్తుంది.మిగతా 1,697 పుస్తకాలు రూ.4.1 లక్షలకు అమ్ముతున్నారు.

అదేంటి అన్నీ ఒకే రకం పుస్తకాలైనప్పుడు రేట్లలో తేడా ఏంటి అనుకుంటున్నారా.ఈ పుస్తకాలకు డిజైనర్‌ స్టాండ్‌లాంటి అదనపు హంగులు ఉండకపోవడమే కారణమట.

514 పేజీలుండే ఆ పుస్తకాన్ని ఉంచిన స్టాండ్‌ కోసమే అంత రేటు అంటున్నారు.ఈ పుస్తకాన్ని మ్యూజియంలకు, ఫెరారీ కార్లను ఎక్కువగా కొనే వినియోగదారులకు మాత్రమే అమ్ముతారట.

చూడ్డానికి ఫెరారీ 12 సిలెండర్ల ఇంజిన్‌లా ఉంటుంది స్టాండ్.స్టీల్‌పై క్రోమియం పూత వేసి తయారుచేశారు.

అల్యూమినియం పెట్టెలో ఉంచారు.ఈ బుక్‌ స్టాండ్‌ను డిజైనర్‌ మార్క్‌ న్యూసన్‌ రూపొందించారట.

.

తాజా వార్తలు