త్వరలో బీజేపీలోకి ఫిరోజ్ ఖాన్...పాతబస్తీ టార్గెట్టా?  

Feroze Khan to join BJP soon Patabasti Targetta, congress party, bjp, Telangana congress , Feroze Khan ,Patabasti Targetta - Telugu @bjp4telangana, #telanganacongress, Bjp, Firoz Khan, Patabasti Targetta, Telangana Congress

తెలంగాణలో బీజేపీ భారీ వ్యూహాలతో రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై మాటలతూటాలు పేలుస్తూ క్షేత్ర స్థాయిలో పటిష్ట కార్యకర్తల నిర్మాణం చేపడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తోంది బీజేపీ.

TeluguStop.com - Feroze Khan To Join Bjp Soon Patabasti

అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బీజేపీ ఇతర పార్టీలలో ఉన్న బడా నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది.ఇప్పటికే వివేక్, కూనం శ్రీశైలం గౌడ్ లాంటి కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించుకోవాలనుకుంటున్న బీజేపీకి పాతబస్తీలో పాగా వేయడం అనేది బీజేపీ డ్రీమ్.కాని అక్కడ బీజేపీకి బలమైన నాయకత్వం లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అంతగా ప్రభావం చూపే పరిస్థితులలో లేకపోవడంతో పాతబస్తీలో బీజేపీ సత్తా చాటుకోలేకపోయింది.

TeluguStop.com - త్వరలో బీజేపీలోకి ఫిరోజ్ ఖాన్…పాతబస్తీ టార్గెట్టా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే పాత బస్తీలోబలమైన నేతగా పేరున్న కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో బీజేపీలో చేరాలని చర్చలు జరుపుతున్నట్లు వార్త హల్ చల్ చేస్తోంది.దీనిపై ఇంకా ఎవరూ అధికారికంగా స్పందించకపోవడంతో వార్త నిజమా… కాదా అనేది కూడా నిర్ధారించుకోలేని పరిస్థితి ఉంది ఈ అనుమానానికి భవిష్యత్తులో సమాధానం దొరికే అవకాశం ఉంది.

#Firoz Khan #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు