మరో బీజేపీ నేత పై అత్యాచార ఆరోపణలు  

Female Doctor Abused Case Files Against Bjp Mla-female Doctor,female Doctor Complaint Against Bjp Mla

ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే.అంతటి విజయాన్ని సాధించిన ఆ పార్టీ కి ఆ పార్టీ నేతల వల్ల ఇరకాటంలో పడుతుంది.

Female Doctor Abused Case Files Against Bjp Mla-female Doctor,female Doctor Complaint Against Bjp Mla-Female Doctor Abused Case Files Against BJP MLA-Female Complaint Bjp Mla

ఇప్పటికే పలువురు బీజేపీ నేతల పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో బీజేపీ ఎమ్మెల్యే పై కూడా అత్యాచార ఆరోపణలు వచ్చాయి.అరుణాచల్ ప్రదేశ్ లోన్ బామెంగ్ లో ఇది చోటుచేసుకుంది.ఒక డాక్టర్ బామెంగ్ ఎమ్మెల్యే గోరఖ్ పొర్దంగ్ నా పై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఆమె ఆరోపించింది.

Female Doctor Abused Case Files Against Bjp Mla-female Doctor,female Doctor Complaint Against Bjp Mla-Female Doctor Abused Case Files Against BJP MLA-Female Complaint Bjp Mla

వివరాల్లోకి వెళితే….ఇటానగర్ లోని ఒక హోటల్ లో బస చేసిన గోరక్ ను కలవడానికి వివాహిత అయిన ఒక మహిళా డాక్టర్ వెళ్ళింది.అయితే తనని కలవడానికి వచ్చిన ఆ మహిళా డాక్టర్ పై ఆయన అత్యాచారం చేశారంటూ ఆ డాక్టర్ ఇటానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే దీనిపై గోరక్ మాత్రం అలాంటిది ఏమి లేదని,నాపై ఎవరో కుట్ర పన్నుతున్నారు అని,రాజకీయంగా నన్ను ఎదగకుండా చేయడానికి ఇలా ప్లాన్ చేసున్నట్లు తెలిపారు.అంతేకాకుండా ఆమె ఇదివరకే నన్ను పలు మార్లు కలిసింది అని అసలు ఎలాంటి అత్యాచారం జరగలేదు అని ఆయన స్పష్టం చేస్తున్నారు.

12 వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యే కావడం తో ఆ మహిళా డాక్టర్ ఆరోపణలపై నిజా నిజాలను తెలుసుకొనే ప్రయత్నం లో ఈ జాప్యం జరిగింది అని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఉన్నావ్ కేసులో ఒక బీజేపీ నేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సమయంలో మరో బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇలాంటి అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవడం తో ఆ పార్టీ మరోసారి ఇరకాటంలో పడింది.

మరి దీనిపై బీజేపీ హైకమాండ్ ఆ ఎమ్మెల్యే పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.