కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తిపై మ‌హిళ దాడి.. ఏం జ‌రిగిందంటే..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తోంది.ఎందుకంటే అలాంటివి అస‌లు జ‌రుగుతాయా అనిపించేంతలా అవి ఉంటున్నాయి.

 Female Attack On Vegetable Seller   What Happened  Vegetable Seller, Viral Video-TeluguStop.com

ఇక రోడ్డు ప‌క్క‌న స్ట్రీట్ వెండ‌ర్స్ మీద చాలామంది దాడులు కూడా చేస్తున్నారు.అది కూడా లేడీస్ చేయ‌డ‌మే అంతలా ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది.

చాలామంది అమ్మాయిలు ఇలాగే దాడులు చేస్తున్నారు.అందుకు వారు చెప్పే కార‌ణాలు కూడా విచిత్రంగా అనిపిస్తున్నాయి.

మొన్న‌టికి మొన్న ఓ అమ్మాయి పాణీ పూరీలు అమ్ముకునే వ్య‌క్తి మీద దాడి చేయ‌డం కూడా చూశాం.

కాగా ఇలాంటి దాడుల‌కు సంబంధించిన వీడియోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.కాగా ఈ వీడియోల మీద నెటిజ‌న్లు మాత్రం చాలా మండిప‌డుతున్నారు.

అమ్మాయిల‌ది త‌ప్పు అంటూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.కాగా ఇప్పుడు కూడా ఓ అమ్మాయి కూర‌గాయ‌లు అమ్ముకునే వ్య‌క్తి మీద ఇలాగే దాడి చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.భోపాల్ జిల్లాలోని బైపాస్ ఏరియాలో రోడ్డుపై వెళ్తున్న అమ్మాయి కారుకు అనుకోకుండా పండ్లు అమ్ముకునే వ్య‌క్తి తోపుడు బండి అడ్డు త‌గిలింది.

అంతే.ఆమె కారులోంచి వేగంగా దిగి.అత‌నిపై విరుచుకు ప‌డింది.త‌న కారుకు ఎందుకు త‌గిలించావంటూ అత‌ని మీద దాడికి దిగింది.అత‌ను ఎంత బ‌తిమాలుకున్నా స‌రే విన‌లేదు.ఆ వ్య‌క్తి మాత్రం ఆ కారుకు ప‌డ్డ గీత‌ల‌కు రిపేర్ చేయించుకోవ‌డానికి డ‌బ్బులు కూడా ఇస్తాన‌ని బ‌తిమాలుకున్నాడు.

కానీ ఆమె మాత్రం విన‌కుండా ఆ పండ్ల బండిని కింద ప‌డేసింది.పండ్ల‌న్నీ కింద ప‌డిపోయాయి.

కాగా ప్ర‌వ‌ర్తించిన తీరు మొత్తం అక్క‌డున్న సీసీకెమెరాల్లో రికార్డు అయింది.ఈ వీడియో చూసిన వారంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube