నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి -హైకోర్టు

నకిలీ విత్తనాల విక్రయాలపై వ్యవసాయ శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.ములుగు జిల్లాలో నకిలీ మిరప విత్తనాలపై ఎంపీపీ సతీష్ దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

 Feit Seeds, Sales Of Counter, High Court, Agriculture Department,-TeluguStop.com

ములుగు జిల్లాలో యుఎస్ 341 మిరప విత్తనాల విక్రయదారుల లైసెన్సులను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.నివేదిక రాగానే సదరు విక్రయదారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

లైసెన్సులు రద్దు చేసినప్పటికీ నకిలీ విత్తనాలను విక్రయించే ప్రమాదం ఉందని హైకోర్టు హెచ్చరింది.నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

రైతులు నకిలీ విత్తనాల వ్యాపారుల ఉచ్చులో పడకుండా ప్రభుత్వం అవగాహన కల్పించాలని సూచించింది.నకిలీ విత్తనాలు రైతుల జీవితాలతో ముడిపడిన కీలక అంశమని, నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆగస్టు 6వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube