మీరు వాడుతున్న ఐఫోన్ స్లో అయిందని అనిపిస్తుందా..? అయితే ఇలా ఫాలో అవ్వండి..!

ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి.ఐతే కొత్తగా కొన్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ బాగా స్పీడ్ గా పనిచేస్తాయి కానీ ఒక్కోసారి వాడేకొద్దీ స్మార్ట్ ఫోన్ వేగం అనేది తగ్గిపోతుంది.

 Feel That Your Iphone Is Slow  But Follow Like This  Iphone, Users, Strucked, Te-TeluguStop.com

అయితే కంపనీ ఫోన్లు కూడా ఒకానొక సందర్భంలో స్లో అయిపోతాయి.మొబైల్ రంగంలో ఎంతో పేరు గాంచిన ఐఫోన్ లు కూడా రాను రాను స్లో అయిపోతున్నాయి.

మరి ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా మీ ఐఫోన్ ఎప్పటిలాగా వేగంగా వర్క్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించండి.ఐఫోన్‌ లలో మనం సేవ్ చేసుకునే డేటా అనేది పెరుగపోవడం వలన ఫోన్ పై భారం పెరుగుతుంది.

అలాగే కొంతమంది తమ ఐ ఫోన్లలో సిరి వాయిస్ ఫైల్స్ వంటి స్టోరేజ్ ఫైల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుని వాటిని వాడడం వలన ఐఫోన్ పర్ఫామెన్స్ అనేది మరింత స్లో అయిపోతుంది.

అలాగే మీ ఫోన్ స్లో అవడానికి మరొక ప్రధాన కారణం క్యాచి అని చెప్పవచ్చు.

ముందుగా మీరు తెలుసుకోవాలిసిందల్లా ఒక్కటే మీరు వాడే ఐఫోన్‌ లలో అనవసరపు చేయడం.అది ఎలాగో ఏంటో చూద్దాం.మొదటగా మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.స్టోరేజ్ ఎంత ఉంది అనేది చూసుకుని తరువాత అవసరంలేని స్టోరేజ్ ను డిలీట్ చేసేసుకోండి.

అలాగే మీకు అవసరం లేని యాప్స్ ను కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి.ఒకవేళ అవసరం అనుకుంటే వాటిని మళ్ళీ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

అలాగే ఇప్పుడు ఎవరు చూసిన వాట్సాప్ చాటింగ్, ఫేస్ బుక్ మెసెంజర్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్ ను విరివిగా వాడుతున్నరు.కానీ ఎప్పటికప్పుడు మెసేజెస్ డిలీట్ చేయకుండా అలా ఫోన్లో ఉంచుకోవడం వలన ఫోన్ స్పీడ్ తగ్గుతుంది.

Telugu Iphone, Phone Clear, Strucked, Ups, Tips-Latest News - Telugu

అందుకనే మీకు అవసరం లేని మెసేజెస్ ను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండండి.మెసేజెస్ తో పాటు ఫోన్ కాల్ హిస్టరీ కూడా క్లియర్ చేసుకుంటూ ఉండండి.అలాగే ఇంటర్నెట్ వాడకం కూడా ఇప్పుడు ఎక్కువ అయింది.ప్రతిసారి ఇంటర్నెట్ బ్రౌజర్ లలో ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తూ ఉంటాం.అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి యూస్ చేసినప్పుడు కూడా ఇంటర్నెట్ బ్రౌజర్ కొంత క్యాచి స్టోర్ చేస్తుంది.అందుకనే క్యాచి డిలీట్ చేయాలనుకుంటే సఫారీ బ్రౌజర్ లో క్లియర్ హిస్టరీ పై క్లిక్ చేస్తే హిస్టరీ క్లియర్ అవుతుంది.

అప్పుడు ఫోన్ స్లో అవ్వదు.అలాగే ఫోన్ లో అనవసరమైన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి.

పై చిట్కాలు పాటించడం వలన మీ ఐఫోన్ కొత్త దానిలాగా పని చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube