పిల్లి తెచ్చిన తంటా...మహిళని పట్టించిన పిజ్జా...!!!  

Feeding Cat Made A Women Arrest In Florida -

అమెరికాలోని ఫ్లోరిడాలో పిల్లులు ఎక్కువగా ఉంటాయి.వాటితో ఎక్కడ అనారోగ్య సమస్యలు వస్తాయోనని స్థానికులు భయపడుతుంటే అధికారులు వాటిని పట్టుకుని దూరంగా వదిలివేయడానికి బోనులు ఏర్పాటు చేశారు.

Feeding Cat Made A Women Arrest In Florida

అయితే ఒక్క పిల్లిపిల్ల కూడా ఆ బోనులో చిక్కుకోలేదు.అయితే ఇదే సమయంలో లీసా అనే ఓ మహిళ పిల్లులని బోనుకి దూరంగా తీసుకువెళ్ళి ఆహారం పెట్టడం గమనించారు స్థానికులు.

అయితే ఎందుకు నువ్వు వాటికి తిండి పెడుతున్నావు.నువ్వు ఎక్కడి నుంచీ వచ్చావు అంటూ స్థానికంగా ఉన్న ఓ మహిళా ఆమెని ప్రశ్నించింది.దాంతో జంతు ప్రేమికురాలు అయిన లీసా తన కారు డోర్ తీసి అందులో నుంచీ తుఫాకి తీసి ఆమెని ప్రశ్నించిన మహిళ తలకి తుఫాకి గురిపెట్టి తనని అడ్డుకోవద్దని బెదిరించింది.దాంతో లీసా అక్కడి నుంచీ వెళిపోయింది.

ఆమె ఎక్కడ ఉంటుందో తెలియక పోలీసులని ఫిర్యాదు చేయలేదు ఆ మహిళ.

అయితే అనుకోకుండా ఒకరోజు ఆ మహిళ ఓ పిజ్జా ఆర్డర్ చేసింది.దాన్ని డెలివరీ చేయడానికి తన తలకు తుపాకీ గురిపెట్టిన లీసానే రావడంతో ఒక్క సారిగా షాక్ అయ్యింది.వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

దాంతో ఆ ఫిజ్జా సంస్థకి వెళ్లి పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Feeding Cat Made A Women Arrest In Florida- Related....