జనవరి 6 ఘటన : రికార్డులు కాంగ్రెస్ కమిటీకి ఇవ్వొద్దన్న ట్రంప్‌.. షాకిచ్చిన కోర్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి షాకిచ్చారు.యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌పై ఈ ఏడాది జనవరి 6న జరిగిన హింసకు సంబంధించిన వైట్‌హౌస్ రికార్డులను కాంగ్రెస్ ఇన్వెస్టిగేటర్లకు అప్పగించొద్దంటూ ట్రంప్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

 Federal Judge Refuses Trump's Request To Block January 6 Records , U.s. District-TeluguStop.com

జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే.దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, ట్రంప్ సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర వుందని అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

తీర్పు సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ మాట్లాడుతూ.ట్రంప్ మద్ధతుదారులు చేసిన హింసాత్మక తిరుగుబాటుకు సంబంధించి రికార్డులను పొందేందుకు కాంగ్రెస్‌కు బలమైన ప్రజామద్ధతు వుందని వ్యాఖ్యానించారు.

దాడికి సంబంధించిన పత్రాలను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు లేదా నిలిపివేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌కు అధికారం వుందని జడ్జి అన్నారు.

కోర్టు ఉత్తర్వులకు ముందే శుక్రవారం నాటికి జనవరి 6 ఘటనకు సంబంధించిన పత్రాలను హౌస్ కమిటీకి ఇవ్వాలని నేషనల్ ఆర్కైవ్స్ యోచిస్తోంది.

అయితే ట్రంప్ తరపు న్యాయవాదులు మాత్రం వెనక్కి తగ్గేదే లే అన్నట్లుగా కొలంబియా సర్య్కూట్ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు.అయితే చివరికి ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే.ఇటువంటి విపత్కర పరిస్ధితుల్లో ప్రస్తుతం అధికారంలో వున్న వారి అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యత వుంటుందని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇక ఆర్కైవ్స్ విషయానికి వస్తే.సదరు రికార్డులలో జనవరి 6 నాటి ఫోన్ కాల్ డేటా, ప్రసంగాల డ్రాఫ్ట్‌లు, ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ స్వయంగా రాసిన నోట్స్ వున్నాయి.

అలాగే అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ మాట్లాడిన అంశాల కాపీలు, తదితర విలువైన పత్రాలు వున్నాయి.

Telugu Federaljudge, Joe Biden, National, Trump, Trumpstaff, Judgetanya, Whitepr

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.

భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.

వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube