ట్రంప్‌కి మరో షాక్: హెచ్-4బీ వీసాదారుల EAD వర్క్ పర్మిట్లను తొలగించేది లేదన్న కోర్టు

అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ మాటకు కట్టుబడి విదేశీయుల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఇమ్మిగ్రేషన్ విధానాల్లో సమూల మార్పులకు తెరదీసిన ఆయన.హెచ్-4 EAD వీసాదారులపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన వృతి అనుమతుల్ని రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 Federal Courtrefuses Tostrike Down Work Permits For Spouses Of H1bvisa Workers-TeluguStop.com

అయితే ఈ ఆదేశాలపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై స్పందించిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్‌ ముగ్గురు సభ్యుల ధర్మాసనం … ప్రభుత్వ నిర్ణయాన్ని పున: సమీక్షించి, తుది నిర్ణయానికి రావాల్సిందిగా శుక్రవారం దిగువ కోర్టును ఆదేశించింది.అప్పటి వరకు ట్రంప్ సర్కార్ ఆదేశాలను నిలుపుదల చేయడం శ్రేయస్కరమని బెంచ్ అభిప్రాయపడింది.

Telugu Donald Trump, Federal, Visa, Telugu Nri Ups, Trump-

హెచ్-1బీ వీసా ఒక రకమైన వలసేతర వీసా.అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు, ఈ వీసాను కలిగివున్న వ్యక్తుల జీవిత భాగస్వామి, పిల్లలను యూఎస్‌లో నివసించేందుకు అనుమతిస్తారు.అలాగే హెచ్-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు సైతం ఉపాధి అవకాశాలను వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్-4 వీసా నిబంధనను తీసుకొచ్చారు.

అయితే ఈ విధానం వల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ స్థానిక పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయడంతో వివాదం మొదలైంది.హెచ్-4 EAD వీసా కింద అత్యధికంగా లబ్ధిపొందుతోంది భారతీయ మహిళలే.తాజాగా కోర్టు తీర్పుతో భారతీయులతో పాటు ఇతర దేశస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube