ఆత్మహత్యల నివారణకు హాట్‌లైన్ నెంబర్ 988: ఫెడరల్ కమీషన్ ఆమోదం

అమెరికన్లలో నానాటికి పెరిగిపోతున్న ఆత్మహత్యా ప్రవృత్తిని నివారించేందుకు గాను ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఈ క్రమంలో ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంపోందించేందుకు గాను హాట్ లైన్‌ను ఏర్పాటు చేసింది.

 Federal Communications Commission-TeluguStop.com

ఎవరైనా మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 988‌కు ఫోన్ చేసి సాయాన్ని పొందవచ్చని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ ఛైర్మన్ అజిత్ పై గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ కొత్త హాట్ లైన్ ద్వారా 911పై ఒత్తిడి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న వాటిలో 10వది ఆత్మహత్యలే.గత 20 ఏళ్లలో బలవన్మరణాలు 33 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్‌లోని ఐదుగురు సభ్యులచే ఏకగ్రీవంగా ఆమోదించబడిన సూసైడ్ హాట్‌లైన్ ప్రతిపాదనను దేశంలోని టెలిఫోన్ ప్రొవైడర్లు 988 డయల్ కోడ్‌ను 18 నెలల్లోగా అమలు చేయాల్సి ఉంటుంది.అమెరికాలోని అందరికీ తెలిసిన 911 నెంబర్‌ స్ధానంలో 988 త్వరలోనే మారుమోగుతుందని అజిత్ ఆకాంక్షించారు.

ఈ మూడు అంకెల సంఖ్య అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను నిలబెడుతుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.

Telugu Federal, Hotline-

మీడియా సమావేశం సందర్భంగా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్‌కు చెందిన కమీషనర్ మైఖేల్ ఓ రియల్లీ తన సొంత బావ ఆత్మహత్య గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.అయితే మరో కమీషనర్ జెస్సికా రోసెన్‌వర్సెల్ ఈ ప్రతిపాదనను విమర్శించారు.హాట్‌లైన్‌కు మెసేజ్ చేసే అవకాశం ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా ప్రస్తుతం అమెరికాలో 1-800-273-8255 నెంబర్‌తో సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్‌లైన్ అందుబాటులో ఉంది.ఇది దేశవ్యాప్తంగా 163 క్రైసిస్ సెంటర్ల ద్వారా నడుస్తుంది.

దీనికి సమాంతరంగా అత్యవసర పరిస్ధితుల్లో సాయం చేసేందుకు గాను 911 ఉంది.ఫెడరల్ కమ్యూనికేషన్ ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube