ఆ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూపాయికే బైక్?

నేటి తరం యువకుల్లో చాలామందికి మంచి బైక్ కొనుక్కోవాలనుకోవడం ఒక కల.అయితే తగినంత డబ్బు లేక లేదా ఇతర కారణాల వల్ల చాలామంది బైక్ కొనుగోలును వాయిదా వేస్తుంటారు.

 Federal Bank Bumper Offer To Bank Customers,emi, Down Payment, Festival Offers,-TeluguStop.com

సామాన్య, మధ్య తరహా కుటుంబాలకు చెందిన యువకులు ఎక్కువగా ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే బైక్ కొనాలనుకునే వారికి ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది.
కేవలం రూపాయి డౌన్ పేమెంట్ తో బైక్ కొనుక్కునే అవకాశం కల్పించింది.అయితే ఈ ఆఫర్ ను అందరూ పొందలేరు.ఎవరైతే ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లై ఉంటారో వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులవుతారు.దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కస్టమర్లకు ఫెడరల్ బ్యాంక్ ఈ శుభవార్తను చెప్పింది.

దేశంలో వెయ్యికి పైగా బ్రాంచ్ లు ఉన్న ఫెడరల్ బ్యాంక్ కు సంబంధించిన ఏ బ్యాంక్ నుంచైనా ఈ ఆఫర్ ను సులువుగా పొందవచ్చు.

ఈ ఆఫర్ పొందాలనుకునే ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు సమీపంలోని బ్రాంచ్ కు వెళ్లి ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ సహాయంతో రూపాయి చెల్లించాలి.అనంతరం టీవీఎస్ మోటార్స్ లేదా హోండా మోటార్స్ సైకిల్ లేదా హీరో మోటో కార్ఫ్ నుంచి బైక్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.3,6,9,12 నెలల వాయిదాల రూపంలో బైక్ ఖరీదును చెల్లించాల్సి ఉంటుంది.బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు మొబైల్ ద్వారా అర్హులో కాదో తెలుసుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ పేర్కొంది.
7812900900 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ‘DC-SPACE-EMI’ మొబైల్ లో టైప్ చేసి 5676762 బ్యాంక్ కస్టమర్ సులువుగా ఆఫర్ కు అర్హుడో కాదో తెలుసుకోవచ్చు.ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉన్నవాళ్లు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఐటమ్స్ ను దేశంలోని 36 వేల షోరూంలలో ఈ.ఎం.ఐ సౌకర్యం ద్వారా కొనుగోలు చేయవచ్చని బ్యాంక్ వెల్లడించింది.ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ తో బైక్ కొనుగోలు చేయడానికి ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube