ఫిబ్రవరి 17న బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ.. బరిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

2023లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడేందుకు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి.డిసెంబర్ నెలలో చాలా సినిమాలు రాగా కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

 February 17 Box Office Risk For Everyone , Shaakuntalam, Samantha, Sir, Dhanush,-TeluguStop.com

ఇక ఇప్పుడు జనవరిలో కూడా సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.ఇవన్నీ కూడా పెద్ద సినిమాలు అనే చెప్పాలి.

స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు సంక్రాంతి బరిలో రాబోతున్నారు.పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు ఏ మాత్రం భయటపడకుండా విడుదల చేస్తున్నారు.

ఇక జనవరిలో చాలా సినిమాలు రాబోతున్నప్పటికీ ఫిబ్రవరి కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

మరీ ముఖ్యంగా ఫిబ్రవరి 17న చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఇప్పటికే ఈ డేట్ లో ఎవరెవరు రాబోతున్నారు అని రిలీజ్ డేట్ అఫిషియల్ గా ప్రకటించారు.మరి ఈ రోజు రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో గుణశేఖర్ ”శాకుంతలం” ఒకటి.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న రాబోతున్నట్టు తాజాగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.

మరి ముందు ముందు అయినా ఈ సినిమా బజ్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి.ఇక మరో పెద్ద సినిమాగా ధనుష్ ‘సార్’ సినిమా రాబోతుంది.

ఈ సినిమా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది.

ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా రాబోతున్నారు.అందులో ఒకటి కిరణ్ సబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కాగా.మరో సినిమా విశ్వక్ సేన్ ధమ్కీ రిలీజ్ కాబోతుంది.ఈ రెండు సినిమాలు కూడా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతున్నాయి.కాబట్టి ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కానీ నిలదొక్కుకోవడం కష్టం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube