మీ రాశిని బట్టి మీ భయాలు ఏమిటో తెలుసుకోండి   Fear Zodiac Sign     2018-03-03   01:35:28  IST  Raghu V

జీవితంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో భయానికి గురి అవుతారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఎదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులను బట్టి కూడా భయాలు ఉంటాయి. రాశిని బట్టి ఆ భయాలు పుట్టుకతోనే వస్తాయి. అయితే మీ రాశి ప్రకారం మీకు ఏ భయం ఉందో తెలుసుకోవాలని ఉందా? ఇప్పుడు ఏ రాశీ వారు దేనికి భయపడతారో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశి వారికి తమకు సన్నిహితంగా ఉండేవారు దూరం అవుతారనే భయం ఉంటుంది. ఒకవేళ సన్నిహితులు దూరం అయితే కనుక మిగతవారి కంటే వీరికి ఎక్కువ బాధ ఉంటుంది.

వృషభ రాశి
వీరు తమ టాలెంట్ తో ఏదైనా సాధించగలమని అనుకుంటారు. కానీ విజయం సాధిస్తామా లేదా అనే విషయంలో నమ్మకం ఉన్నా సరే భయపడుతూ ఉంటారు. అలాగే వీరు డబ్బు విషయంలో భయపడుతూ ఉంటారు.

మిధున రాశి
ఈ రాశి వారు ప్రతి విషయాన్నీ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు. వీరిలో కూడా మంచి టాలెంట్ ఉంటుంది. అయినా సరే నిర్ణయం తీసుకోవటానికి భయపడుతూ ఉంటారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఏమి అవుతుందో అనే భయంతో ముందడుగు వేయలేరు.

కర్కాటక రాశి
వీరు కొత్త అవకాశాలను ఒడిసి పట్టుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు కలలను కంటారు. కానీ వాటిని నెరవేర్చుకోవడానికి దైర్యం ఉండదు. వీరు జీవితాన్ని రొటీన్ గా గడిపేస్తారు. అసలు సాహసాలు అంటే భయం. అందుకే వాటి జోలికి వెళ్ళరు.

సింహ రాశి
సింహరాశి వారు చాలా దైర్యంగా ఉండి ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ ఉనికిని చాటటంలో విఫలం అవుతామనే భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్నవారు గౌవరం ఇవ్వాలని కోరుకుంటారు. ఆలా గౌరవం ఇవ్వరేమో అని భయపడుతూ ఉంటారు.

కన్య రాశి
ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్నవారు తమపై ప్రేమను చూపటం లేదనే భయంతో ఉంటారు. అలాగే వీరిని ప్రేమించే వ్యక్తులు కాస్త దూరంగా ఉన్నా, సరిగా మాట్లాడకపోయినా చాలా భయపడిపోతారు.

తుల రాశి
ఈ రాశివారికి ఒంటరితనం అంటే చాలా భయం. ఈ రాశి వారి చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండాలని కోరుకుంటారు. ఈ రాశి వారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళితే మాత్రం విపరీతమైన భయానికి గురి అవుతారు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు తమలోని భావాలను బయట పెట్టటానికి భయపడుతూ ఉంటారు. వీరు ఎన్నో విషయాలను చెప్పాలని అనుకున్న చెప్పలేరు. వీరికి అతి జాగ్రత్త ఎక్కువ. తెలిసిన వారు,స్నేహితులు నమ్మకద్రోహం చేస్తారని భయపడుతూ ఉంటారు.

ధనస్సు రాశి
ఈ రాశివారికి ఆనందంగా అందరితో కలిసి ప్రయాణాలు చేయాలనీ ఉంటుంది. వీరికి ఒంటరితనం అంటే భయం. ఒకవేళ వీరిని ఒంటరిగా ఒక గదిలో ఉంచితే చావు అంచుల దాక వెళ్లివస్తారు.

మకర రాశి
ఈ రాశివారు సక్సెస్ అవుతామా లేదా అనే విషయంలో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. చాలా కష్టపడి పనిచేసిన సరే విఫలం అవుతామేమో అని భయపడుతూ ఉంటారు.

కుంభ రాశి
ఈ రాశివారు చాలా చిన్న విషయాలకు కూడా భయపడుతూ ఉంటారు. వీరు పని చేసే ప్రదేశంలో ఏమైనా సమస్యలు,ఇబ్బందులు వస్తే చాలా భయపడిపోతారు.

మీన రాశి
ఈ రాశి వారు ఎక్కువగా స్వేచ్ఛా జీవిగా ఉండాలని ఇష్టపడతారు. జీవితాన్ని ఎటువంటి ఇబ్బందులు,సమస్యలు లేకుండా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వీరికి ఏదైనా భాద్యత అప్పగిస్తే మాత్రం చాలా భయపడిపోతారు.