కేసీఆర్ కు ముందస్తు భయం.. మరి బీజేపీ ఏం చేయనుంది...

దేశంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది.కొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాలు (పంజాబ్, గోవా, యూపీ, మణిపూర్, ఉత్తారాఖండ్) తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

 Fear Ahead Of Kcr . And What Will Bjp Do .., Kcr, Trs, Elections, Bjp Party , Am-TeluguStop.com

ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో గెలిస్తే ముందస్తు వెళ్లాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పోయిన సారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సారధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ పార్టీ చేసినట్లే చేయాలని భావిస్తోంది.

2014లో బొటాబొటి మెజార్టీతో బయటపడిన టీఆర్ఎస్ ఐదేళ్లు పాలించకముందే 2018లో ముందస్తుకు వెళ్లి బాగా లాభపడింది.

ఆ ఎన్నికల్లో పార్టీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.బంపర్ మెజార్టీని సాధించింది.మరి ఈ సారి కూడా ముందస్తుకు వెళ్తారా? అనే అనుమానం అనేక మందిలో నెలకొంది.కానీ ఈ సారి మాత్రం టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లే సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఎందుకంటే.

ప్రస్తుతం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో గెలిస్తే అదే ఊపు మీద బీజేపీ ముందస్తుకు వెళ్లాలని భావిస్తోంది.ఇక ఈ పరిణామం టీఆర్ఎస్ కు అంతగా కలిసి రాకపోవచ్చునని అంతా అనుకుంటున్నారు.బీజేపీని ఢీ కొట్టేందుకు టీఆర్ఎస్ ప్రజెంట్ అంతగా ఫామ్ లో లేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదైనా బీజేపీని నిలువరించడం టీఆర్ఎస్ కు పెద్ద సవాలేనని కావున బీజేపీ ముందస్తుకు వెళ్లేందుకు చూస్తోంది కావున టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లే సాహసం చేయకపోవచ్చునని అంటున్నారు.మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

భవిష్యత్ లో ఎవరు ఎలా అడుగులేస్తారో చెప్పడం మాత్రం చాలా కష్టం.కానీ ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయని చాలా మంది చెబుతున్నారు.

Fear Ahead Of KCR . And What Will BJP Do , Kcr, Trs, Elections, Bjp Party , Amith Sha, Bandi Sanjay , Ts Poltics , Ktr - Telugu Amith Sha, Bandi Sanjay, Bjp, Ts Poltics

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube