చైనా పరిశోధకులతో జాగ్రత్త: అమెరికన్ వర్సిటీలకు ఎఫ్‌బీఐ హెచ్చరిక

చైనా నుంచి వచ్చే పరిశోధకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మరోసారి అమెరికాలోని అన్ని విశ్వవిద్యాలయాలను హెచ్చరించింది.మేథోసంపత్తిని తస్కరించేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఇందుకు సంబంధించి కొన్ని ఈమెయిల్స్‌ను విశ్లేషించినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.

 Fbiwarns Us Campuses Over Chinese Intellectual Propertytheft-TeluguStop.com

అయితే చైనా తదితర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులు, పరిశోధకులకు అనుమానించడం తమ ఉద్దేశ్యం కాదని.కానీ అమెరికా ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని న్యాయశాఖకు చెందిన అత్యున్నత అధికారి, అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ డీమర్స్ స్పష్టం చేశారు.

మేథోసంపత్తిని ఏ విధంగా తస్కరించే ప్రమాదముందో తాము అన్ని వర్సిటీలకు తెలియజేశామని డీమర్స్ పేర్కొన్నారు.ఇప్పటికే ఎఫ్‌బీఐ ఏజెంట్లు అమెరికా వ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో సెమినార్లు ఇవ్వడంతో పాటు యాజమాన్యాలకు సైతం స్పష్టమైన అవగాహన కల్పించామని, విద్యార్థులకు సైతం కరపత్రాలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.

Telugu Telugu Nri Ups-

 ప్రస్తుతం అమెరికాకు చైనా అన్ని రంగాల్లో అతిపెద్ద ముప్పని.గడిచిన దశాబ్ధకాలంలో మనదేశానికి చెందిన మేథోసంపత్తిని, టెక్నాలజీని డ్రాగన్ రహస్యంగా తస్కరించిందని అమెరికా చీఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారి విలియం ఇవానినా తెలిపారు.కాగా.సెప్టెంబర్ నెలలో సిలికాన్ వ్యాలీలోని ఒక కంపెనీలో పనిచేస్తున్న చైనా ప్రొఫెసర్‌ను టెక్సాస్ యూనివర్సిటీ అధికారులు పట్టుకున్నారు.ఇతను ఆర్ట్ టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని చైనా టెక్ దిగ్గజం హువావేకు రహస్యంగా అందిస్తున్నట్లు తేలడం కలకలం రేపింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube