అచ్చం యాపిల్ ఫోన్లలాగే: 6.1 మిలియన్ల స్కామ్, 11 మందిని అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ  

Fbi Busts $6 Million Iphone And Ipad Counterfeit Ring In San Diego - Telugu Apple Iphone Scam, Duplicate Iphone, Fbi, Iphone And Ipad Counterfeit Ring, Nri, San Diego, Telugu Nri News Updates

ఆపిల్ కంపెనీ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్లపై ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆ కంపెనీ సీఈవో కొత్తగా ఓ మోడల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారంటే చాలు ఆఫీసులు ఎగ్గొట్టి టీవీలకు అతుక్కుపోయేవారు ఎంతోమంది వున్నారు.

Fbi Busts $6 Million Iphone And Ipad Counterfeit Ring In San Diego

ఇలాంటి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని ఓ ముఠా పన్నిన కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) రట్టు చేసింది.అచ్చం ఐపిల్ ఉత్పత్తులను పోలీ ఉండేలా నకిలీ వస్తువులను తయారు చేస్తున్న ఈ ముఠా ఎంతోమందికి వాటిని అంటకట్టింది.

ఇందుకు గాను చైనా నుంచి 10,000కు పైగా నకిలీ ఐఫోన్లు మరియు ఐప్యాడ్‌లను దిగుమతి చేసుకున్నట్లు యూఎస్ అటార్నీ జనరల్ రాబర్ట్ బ్రూవర్ మీడియాకు తెలిపారు.

ఈ ముఠాకు చెందిన వ్యక్తులు దెబ్బతిన్న ఐఫోన్ ఉత్పత్తులను వివిధ దేశాల నుంచి రప్పించి వాటిని యాపిల్ స్టోర్లలో మార్పిడి చేస్తారు.

అనంతరం వాటిని చైనా తదితర దేశాలకు రవాణా చేసి విక్రయిస్తారని ఆయన వెల్లడించారు.అయితే అసలైన యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లకు ఇంటర్నేషనల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)తో పాటు ప్రత్యేకమైన సీరియల్ నెంబర్లు ఉంటాయి.

ఈ ముఠా తయారు చేస్తున్న వస్తువులకు సైతం ఐఎంఈఐ నెంబర్లు, సీరియల్ నెంబర్లు ఉన్నాయి.అంతేకాకుండా ఇవి యూఎస్, కెనడా ఆపీల్ వారెంటీ కవర్‌తో కప్పబడి నిజమైన యాపిల్ ఉత్పత్తులతో సరిపోతున్నాయని అటార్నీ వెల్లడించారు.

ఈ రాకెట్‌తో మొత్తం 14 మందికి సంబంధం వున్నట్లు ఎఫ్‌బీఐ భావిస్తోంది.ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకోగా.మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.వీరిపై మోసం, కుట్ర, గుర్తింపును దొంగిలించడం, మనీలాండరింగ్ ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డియాగోలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది.ఈ కుంభకోణం మొత్తం విలువ 6.1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fbi Busts $6 Million Iphone And Ipad Counterfeit Ring In San Diego Related Telugu News,Photos/Pics,Images..

footer-test