అమెరికా పోలీసుల బంపర్ ఆఫర్...!!

అమెరికా కాపిటల్ పై దాడి ఘటనపై యావత్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.ఓ దేశాధ్యక్షుడే ఏకంగా దాడికి ఉసిగొల్పేవిధంగా వ్యాఖ్యానించడం, ఆందోళన కారులను మరించగా రెచ్చగొట్టడం అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోనుంది.

 Fbi Offers 50000 Dollars Reward In Pipe Bomb Suspects In Capitol, Us Capitol, Pr-TeluguStop.com

అమెరికా కాపిటల్ కు ఇప్పటివరకూ ఇలాంటి ఘోరమైన అవమానం జరగలేదని అంటున్నారు రాజకీయవేత్తలు.ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన సంఖ్య 5 కు చేరుకుంది.

కాగా కేంద్ర బలగాలు ఎంట్రీ ఇచ్చి ఆందోళన కారులను తరిమికొట్టిన తరువాత విచారణ చేపట్టిన పోలీసులు షాక్ అయ్యే సంఘటనలు అక్కడ కనిపించాయి.

ఆందోళన కారులు వెళ్ళిపోయినా తరువాత దర్యాప్తు బృందాలు వచ్చి కాపిటల్ భవనం మొత్తం పరీక్షిచాయి.

ఈ క్రమంలో అక్కడ వారికి పైప్ బాంబులు కనపడటంతో అధికారులు అందరూ అప్రమత్తం అయ్యారు.ప్రమాదకరమైన పైప్ బాంబులు అక్కడికి ఎవరు తీసుకువచ్చారు.ఆందోళన ముసుగులో అవాంచనీయ సంఘటనలు జరిపే కుట్రలు ఏమన్నా చేశారా అనే సందేహాలు వెలుబుచ్చారు అధికారులు.అసలు ఈ పైప్ బాంబులు ఎవరు అక్కడికి తీసుకువచ్చారు అనే అంశం పెద్ద చర్చకు దారితీసింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అణువణువు ఆధారాల కోసం గాలిస్తున్నారు.అయితే

Telugu Americans, Fbioffers, Fbi, Pipe Bomb, Protesters, Capitol-Telugu NRI

ఈ కేసును చేధించే విషయంలో తలమునకలైన ఎఫ్ బీఐ నిందితులని పట్టుకోవడానికి అమెరికన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ పైప్ బాంబులు ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారో చెప్పిన వారికి భారీ బహుమతి ఉంటుందని ప్రకటిచింది.నిందితుల వివరాలు చెప్పిన వారికి 50 వేల డాలర్లు బహుమతిగా అందిస్తామని ప్రకటించింది.

ఈ కేసును వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రాధమిక ఆధారాలు సేకరించామని త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎఫ్బీఐ ప్రకటించింది.అయితే ఈ కేసు విషయంలో అంత పెద్ద మొత్తం ప్రకటించడంపై అమెరికన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube