హమ్జా లాడెన్ కార్యకలాపాల పై ఆరా తీస్తున్న ఎఫ్ బీ ఐ

అగ్రరాజ్యం అమెరికా అల్ఖైదా అంతర్జాతీయ తీవ్రవాది, మోస్ట్ వాంటెడ్ ఒసామాబిన్ లాడెన్ గురించి అంత తేలికగా మరిచిపోలేదు.ఎందుకంటే అతడి చర్య వల్ల ఆ దేశం ఎంత నష్టపోయింది అందరికీ తెలిసిందే.

 Fbi Is Looking At Hamza Ladens Activities-TeluguStop.com

అయితే ఇప్పుడు లాడెన్ కుమారుడైన హమ్జా బిన్ లాడెన్ గురించి అమెరికా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీ ఐ) ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఎఫ్ బీ ఐ హమ్జా కార్యకలాపాలపై మరింత సమాచారం కావాలని కోరుతూ ఒక పోస్ట్ ను పెట్టింది.హమ్జా బిన్ లాడెన్ అల్ ఖైదాలో చేరి అమెరికాను బహిరంగంగానే హెచ్చరిస్తూ ప్రకటనలు కూడా చేయడం తో లాడెన్ కుమారుడు హమ్జాను అమెరికా 2017లోనే అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది.

ఈ క్రమంలో గతంలో హమ్జా బిన్ లాడెన్ ఆచూకీ చెప్పినా, అతన్ని పట్టిచ్చినా మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.అరబ్బీ భాష మాట్లాడే హమ్జా అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, సిరియా, ఇరాన్ దేశాల్లో ఉండవచ్చిన ఎఫ్ బీ ఐ అనుమానం వ్యక్తం చేస్తుంది.

హమ్జా అల్ ఖైదా సీనియర్ నాయకుడు అబ్దుల్లా అహ్మద్ కుమార్తెను వివాహమాడారని అమెరికాకు సమాచారం అందింది.హమ్జా బిన్ లాడెన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో సౌదీఅరేబియా హమ్జా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేసింది కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube