భారతీయుడి హత్య కేసు..భారీ రివార్డు ప్రకటించిన FBI..!!!

అమెరికాలో 2012 లో భారతీయుడిపై జరిగిన హత్య తాలూకూ కేసుపై FBI సంచలన నిర్ణయం తీసుకుంది.ఈ కేసుకు సంభందించి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కేసుకు సంభందించి విలువైన సమాచారం ఇచ్చిన వారికి భారీ నజరానా ప్రకటించింది.

 భారతీయుడి హత్య కేసు..భారీ రివా-TeluguStop.com

దాంతో అసలు ఈ కేసు ఏమిటి.?? ఈ కేసుపై ఇంత నజరానా ప్రకటించాలా.?? ఎందుకు ఏమిటి ఎలా అంటూ ప్రశ్నలు వేసుకుంటున్నారు.సరే అసలు ఈ కేసు వివరాలు ఏమిటి, పోలీసులు అంత స్పెషల్ గా ఎందుకు తీసుకున్నారు అనే వివరాలోకి ఇప్పుడు వెళ్దాం.

సెప్టెంబర్ 16 , 2012 న అమెరికాలో ఉంటున్న భారతీయుడు పరేష్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు.పటేల్ వర్జీనియాలోని మాంచెస్టర్ ఫీల్డ్ లో ఉద్యోగం చేస్తున్నాడు ఈ క్రమంలోనే కొందరు దుండగులు ఒక రోజు ముసుగులు ధరించి వచ్చి పధకం ప్రకారం పటేల్ ను ఎత్తుకు వెళ్ళారు.

అతడిని చిత్ర హింసలు పెట్టిన తరువాత అత్యంత కిరాతకంగా హతమార్చారు.సుమారు నాలుగు రోజుల తరువాత.

వర్జీనియాలోని రిచ్మండ్ నగరంలోని అంకారా బోట్ ల్యాండింగ్ వద్ద అతడి మృత దేహాన్ని కనుగొన్నారు పోలీసులు.ఆ క్షణం మొదలు ఇప్పటి వరకూ కూడా అతడు చనిపోవడానికి కారణం కానీ, అతడిని ఎవరు హత్య చేశారు అనే కారణాలు కాని తెలియలేదు.

దాంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI ) ఈ కేసుకు సంభందించి సమాచారం అందించిన వారికి 15వేల డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.ఈ ప్రకటనతో అయినా కేసుకు సంభదించి ఏదైనా కీలక సమాచారం దొరుకుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube