కరోనా చికిత్సకు ఫావి ట్యాబ్లెట్.. ధర ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.ఈ తరుణంలో అన్ని దేశాల ఫార్మాకంపెనీలు కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లను, ట్యాబ్లెట్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

 Corona, Treatment, Favi Tablet, Coast-TeluguStop.com

కొన్ని ఫార్మా కంపెనీల వ్యాక్సిన్లు మార్కెట్ లోకి రిలీజ్ అయి బాధితులపై పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.బాధితుడి రికవరీ రేటుకు తగ్గట్లు మెడిసిన్ డోసును తగ్గిస్తూ ప్రయోగాలు చేస్తున్నారు వైద్యులు.

ఈ మేరకు నిర్వహించిన పరీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

తాజాగా, హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ సంస్థ కరోనా చికిత్స కోసం ఫావిపిరావిల్ అనే ట్యాబ్లెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.200 ఎంజీ కలిగిన ఈ ట్యాబ్లెట్ ధరను కూడా ప్రకటించింది.మార్కెట్ లో ఫావి ట్యాబ్లెట్ ధర రూ.33 కే అందించనున్నట్లు సంస్థ సీఎండీ తెలిపారు.ఎంఎస్ఎన్ గ్రూప్ సంస్థ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ…‘‘ కరోనాకు చెక్ పెట్టేందుకు యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్ తో ఫావిపిరావిర్ ట్యాబ్లెట్ ను తయారు చేశాం.

కోవిడ్ చికిత్సలో వాడే ఓసెల్టామివిర్ 75 ఎంజీను ప్రవేశ పెట్టాం.ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్ ను త్వరలో మార్కెట్ లో రిలీజ్ చేస్తాం.డిమాండ్ కు తగ్గట్లు సరఫరా చేయడంతో పాటు తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నాం’’ అని ఆయన పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube