అతను నా చెంప పగులగొట్టాడు.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..?

దంగల్ సినిమా ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం ఫాతిమా సనా షేక్ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తాజాగా ఈ హీరోయిన్ తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒక దారుణమైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

 Actress Fatima Sana Shaikh Recalls She Slapped Man Touching Her He Punched Her B-TeluguStop.com

ఒక సందర్భంలో తనకు పరిచయం లేని వ్యక్తి యొక్క చెంప పగులగొట్టాల్సి వచ్చిందని అయితే ఆ వ్యక్తి కూడా తనను రివర్స్ లొ కొట్టాడని ఫాతిమా సనా తెలిపారు.

ఒకసారి తాను జిమ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఒక వ్యక్తి తనను ఫాలో కావడం తాను గమనించానని ఆమె తెలిపారు.

తనను ఫాలో అవుతున్న వ్యక్తి తేడాగా అనిపించాడని ఆ తరువాత తాను నడుచుకుంటూ వెళుతుంటే కూడా ఆ వ్యక్తి తన వెంటే వచ్చాడని ఫాతిమా సనా చెప్పుకొచ్చారు.తాను ఆగి ఎందుకు ఫాలో అవుతున్నావని ఆ వ్యక్తిని ప్రశ్నించానని అప్పుడు ఆ వ్యక్తి నా ఇష్టం అని బదులిచ్చాడని ఆమె చెప్పారు.

Telugu Dangal, Fatimasana, Fatima Sana, Punched, Slapped-Movie

ఆ తరువాత తాను కోపంగా కొడతానని అతనితో చెప్పగా అతను రివర్స్ లో కొట్టమని అన్నాడని అప్పటికే తనకు ఓపిక పూర్తిగా నశించడంతో తాను కొట్టానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తరువాత ఆ వ్యక్తి కూడా తన చెంప పగులగొట్టాడని ఆమె తెలిపారు.అనంతరం తన తండ్రికి చెంపపై కొట్టిన వ్యక్తి గురించి సమాచారం ఇవ్వగా అప్పటికే ఆ వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడని ఫాతిమా సనా చెప్పుకొచ్చారు.

సినిమా రంగంలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన తరువాత నటిగా తాను ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తమతో గడిపితే మాత్రమే అవకాశాలు ఇస్తామని కొందరు డైరెక్టర్లు చెప్పారని ఆమె అన్నారు.ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు తాను అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని ఫాతిమా సనా చెప్పుకొచ్చారు.

ఎన్ని సమస్యలు ఎదురైనా నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నానని ఆమె వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube