కొంతమంది తల్లిదండ్రులు మా అమ్మాయి అమాయకురాలు, అ..ఇలాంటివి తెలియవు అనుకుంటారు...వారికోసమే ఇది..!  

తల్లితండ్రుల కోసం ఏదైనా చేసే పిల్లలు ఉన్నారు. అలాగే పిల్లలకోసం ఏదైనా చేసే తల్లితండ్రులు కూడా ఉన్నారు. కానీ ఇదే సమాజంలో తల్లితండ్రులను మోసం చేసి వాళ్ళ ఆశలపై నిప్పులు చల్లే పిల్లలు కూడా ఉన్నారు. కానీ తల్లి తండ్రులు మాత్రం తమ పిల్లలు అమాయకులు అని మాత్రం అనుకుంటూనే ఉంటారు. తల్లి తండ్రులు తమ పిల్లల్ని పై చదువులకై పట్నం పంపిస్తుంటారు. పిల్లలు అక్కడ హాస్టల్ లో జీవనం కొనసాగిస్తుంటారు. కొంతమంది తల్లి తండ్రులు ఆశలు నిలబెట్టడానికి ఎంతో కష్టపడుతుంటే మరికొందరు మాత్రం వారి ప్రేమను అర్ధం చేసుకోకుండా చెడు తిరుగుడుకి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు.

అలాగే అమీర్పేట్ హాస్టల్ లో నివసించే ఒకమ్మాయి గురించి ఈ వీడియో. ఆమె తండ్రి ఆమెను కలుద్దామని పల్లెటూరి నుండి వచ్చారు. ఆ సమయంలో ఆమె హాస్టల్ లో ఉండదు. కూతురి ఫ్రెండ్ ని అడిగి కూతురికి ఫోన్ చేస్తారు. కానీ ఆమె వేరొక అబ్బాయితో అశ్లీలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ తండ్రికి మాత్రం ఇంటర్వ్యూ కి వెళ్ళాను అని చెప్తుంది. అదే సమయంలో ఆ తండ్రి మరొక అమ్మాయి తన తండ్రికి ఫోన్ లో అబద్దం చెప్తుండగా వింటాడు. కానీ తన కూతురు మాత్రం ఇలా చేయదు అనే నమ్మకంతో ఉంటాడు ఆ తండ్రి