దారుణం.. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఈ తండ్రి ఏం చేసాడంటే?

ప్రేమ.ఇది రెండు అక్షరాలే అయినా దీనికి అర్ధం చాలా ఉంది.ప్రేమ అనేది కేవలం పదం మాత్రమే కాదు.ఇద్దరి మనుషులను ఒక్కటి చేసే బంధం.భార్య భర్తల మధ్య అయినా ప్రేమికుల మధ్య అయినా అక్క చెల్లెల్లు, అన్న తమ్ముళ్లు ఎవ్వరి  మధ్య అయినా ప్రేమ అనేది ఉంటుంది.ప్రేమ ఉండకపోతే ఆ బంధం నిలవదు.

 Father Who Made Death Ritual To Daughter Who Got Love Married In Mahabubnagar Details, ,father,love Marriage,mahabubnagar,telangana,tribute, Daughter Death Rituals, Daughter Madhavi, Venkatesh, Alive Daughter, Love Marriage-TeluguStop.com

ఇక ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువగానే చేసుకుంటున్నారు.

ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏ గొడవ ఉండదు.

 Father Who Made Death Ritual To Daughter Who Got Love Married In Mahabubnagar Details, ,father,Love Marriage,Mahabubnagar,telangana,tribute, Daughter Death Rituals, Daughter Madhavi, Venkatesh, Alive Daughter, Love Marriage-దారుణం.. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఈ తండ్రి ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా కాదని పెద్దలను ఎదురించి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు.కొంతమంది ప్రేమించి పెద్దలు ఒప్పుకోక పోయిన వివాహం చేసుకునే వారు ఉంటారు.

అలా చేసుకున్నప్పుడు కొంత మంది తల్లిదండ్రులు ఏమి చేయకుండా ఊరుకుంటారు.అయితే మరి కొంత మంది మాత్రం తమ పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దారుణ ఘటనలకు పాల్పడుతూ ఉంటారు.

తాజాగా ఒక తండ్రి ఇలాంటి దారుణమైన ఘటనకు పాల్పడిన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికి ఉండగానే ఒక తండ్రి శ్రద్ధాంజలి ఘటించిన ఘటన ఆ గ్రామంలో చోటు చేసుకుంది.

తన కూతురు మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించి ఈ నెల 13న పెళ్ళి చేసుకుంది.

సమీప బంధువులే అయినా కూడా తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోక పోవడంతో వారు గుడిలో పెళ్లి చేసుకున్నారు.

తన కూతురు తనని కాదని పెళ్లి చేసుకుందని మాధవి తండ్రి భరించలేక తన దృష్టిలో తన కూతురు చనిపోయిందని ఒక అభిప్రాయానికి వచ్చేసి తన కూతురు చనిపోయిందని గ్రామం అంత ప్రచారం చేసి గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు కూడా జరిపించేసాడు.ఆమె ఫొటోకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాడు.కూతురు ఉండగానే పిండం పెట్టిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.

Father Who Made Death Ritual To Daughter Who Got Love Married In Mahabubnagar Details, ,father,Love Marriage,Mahabubnagar,telangana,tribute, Daughter Death Rituals, Daughter Madhavi, Venkatesh, Alive Daughter, Love Marriage - Telugu Alive, Rituals, Madhavi, Love, Mahabubnagar, Telangana, Tribute, Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube