ప్రతి ఒక్కరికి మృత్యువు ఏ విధంగా ఎలా సంభవిస్తుందో ఎవరు కూడా ఊహించలేరు.ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా.తాజాగా ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి తన కొడుకుతో కలిసి చేపలు పట్టడం కోసం నది దగ్గరుకు వెళ్లారు.
ఇంతలో అక్కడికి ఒక భారీ మొసలి వచ్చి కొడుకును మింగేసింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఇండోనేషియా లోని ఈస్ట్ కలిమన్ తన్ లో సుబ్లియాన్షా అనే వ్యక్తి తన 8 సంవత్సరాల వయసు కొడుకు దిమస్ ముల్కన్ సపుత్ర తో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.ఇటీవల వీరిద్దరు కలిసి దగ్గర లో ఉండే నది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు.
ఇద్దరూ కలిసి చేపలు పడుతున్న తరుణంలో హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.ఏకంగా 26 అడుగుల పొడవున్న ఒక మొసలి కొడుకు పై దాడికి పాల్పడింది.
అది గమనించిన తండ్రి కూడా కొడుకును రక్షించేందుకు తెగ ప్రయత్నాలు చేసిన కాని చివరికి కొడుకును దక్కించుకోలేకపోయాడు.
ఈ క్రమంలో 26 అడుగులు గల భారీ మొసలి ఎనిమిదేళ్ల బాలుడుని అమాంతం మింగేసి బాలుడితో సహా నీటి లోకి మొసలి వెళ్ళిపోయింది.
అయితే తాజాగా గ్రామస్తుల సహకారంతో ఆ మొసలి ని చంపి నది ఒడ్డుకు తీసుకొని వచ్చారు.అనంతరం అ మొసలి పొట్టను కోసి దిమస్ మృతదేహాన్ని బయటికి తీశారు గ్రామస్తులందరూ.
దీంతో ఒక్కసారిగా సుబ్లియాన్షా ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులందరూ కలిసి కన్నీటి వీడ్కోలు తో దిమస్ కు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఏది ఏమైనా కానీ.ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతో మంచిది.