దేశంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వారిపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు.రోజురోజుకు కామాంధుల చేతిలో బలైపోతున్నారు.
దేశంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి.తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది కన్న తండ్రే కాలయముడయ్యాడు.
కన్నబిడ్డ పై కన్నేశాడు.అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే కన్నకూతురిపైనే తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దీంతో బాధితురాలు ఏకంగా షీటీం ను ఆశ్రయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా, నవాబు పేట మండలం, మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన తాండాల్లో నివాసముంటున్న పదిహేనేళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తుంది.
కొన్నిరోజులుగా ఆ బాలికను తన తండ్రి లైంగికంగా వేధించాడు.భరించలేని ఆ బాలిక 4 రోజుల క్రితం 100 నెంబర్ కి కాల్ చేసి షీటీం కు ఫిర్యాదు చేసింది.
వారు అక్కడికి చేరుకొని బాలికను చేరదీసి మహబూబ్ నగర్ స్టేట్ హోమ్ కు తరలించారు.అంతకుముందు మెడికల్ టెస్ట్ చేయించాగా మెడికల్ రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.