కన్న కొడుకు లెటర్ చదివిన కన్న తండ్రికి జైలు శిక్ష ఎందుకంటే..

ఒకరికి వచ్చిన లెటర్స్ మరొకరు చదవకూడదు అది సంస్కారం కాదు అని పెద్దలు అంటూ ఉంటారు.అయితే వేరొకరి లెటర్ చదవడం సంస్కారం లేకపోవడం మాత్రమే కాదు అది నేరం అని తెలిసినా కూడా పర్లేదులే అని చదివే వాళ్ళు చాలా మందే ఉంటారు.

 Father Sentenced 2 Year Prison Opening Letter Addressed His Son-TeluguStop.com

ఎందుకంటే అదొక సరదా పక్కవారి లెటర్ చదవాలి అంటే ఉండేంత శ్రద్ద మనకి వచ్చిన లెటర్ పై కూడా అంత శ్రద్ధ పెట్టలేము.కానీ ఒక దేశంలో మాత్రం కన్న కొడుక్కి వచ్చిన లెటర్ ని, కన్న తండ్రే చదివినా జైలు శిక్ష పడింది.

ఇంతకీ ఆ దేశం ఏదంటే స్పెయిన్.వివరాల్లోకి వెళితే….

స్పెయిన్ లోని సెవిల్లె ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి పదేళ్ల కుమారుడికి తల్లి తరపు బంధువుల నుంచి ఒక లేఖ వచ్చింది.ఆ లేఖలో తండ్రి పై ఉన్న గృహహింస కేసుకు సంబందించిన వివరాలను,అతడి చేసిన తప్పులను ఎత్తిచూపుతూ వారు మరికొంత సమాచారంకోసం ఆరా తీస్తూ ఆ పిల్లాడికి లేఖ రాశారు.

అయితే ఆ లేఖను తండ్రి తెరచి చదవడం తో కోర్టుకు వెళ్లి భార్య తరపు బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారు అని,నాపై కావాలనే కేసులు పెడతానన్నారు అంటూ న్యాయమూర్తి వద్ద వాపోయారు.

కన్న కొడుకు లెటర్ చదివిన కన్న

అయితే సరిగ్గా అతడు అక్కడే దొరికిపోయాడు.భార్య తరపు లాయర్ అక్కడే ఒక్క పాయింట్ వేశాడు.అసలు పిల్లాడికి వచ్చిన లెటర్ ని అతడు ఎందుకు చదివాడు అంటూ పాయింట్ లేవనెత్తి న్యాయమూర్తి కి తన వాదనలు వినిపించడం తో ఇక ఈయన గారు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు.

చివరికి ఆ పిల్లాడి గోప్యతకు తండ్రి భంగం కలిగించాడు అని ఆరోపిస్తూ భార్య తరపు లాయర్ గట్టిగా వాదించడం తో అతడి వాదనలను సమర్ధించిన కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష,జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.మనకి కూడా ఇలాంటి శిక్షలు ఉండి ఉంటె మాత్రం నిజంగా వేరొకరి లెటర్ ని చదివితే అందులోనూ సొంత కొడుకుకు వచ్చిన లెటర్ ని చదివితే జైలు శిక్ష అంటే మాత్రం అందరూ వెనక్కి పారిపోవాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube