కొడుకు శవం కోసం 41 రోజులుగా తండ్రి అన్వేషణ.. చివరికి?  

father return to kerala landslide site daily to search for his sons body father, kerala, landslide site, sons body - Telugu Father, Kerala, Landslide Site, Sons Body

ఈ ఘటనతో కొడుకుపై తండ్రికి ఎంత ప్రేమ ఉందో తెలుపుతుంది.ఓ తండ్రి తప్పిపోయిన కన్నకొడుకు ఆచూకీ కోసం ఏకధాటిగా నలభై ఒక్క రోజుల నుంచి కొండను తవ్వుతున్నాడు.

TeluguStop.com - Father Returns To Kerala Landslide Site Daily To Search For His Sons Body

ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ తన కొడుకు ఆచూకీ కోసం తండ్రి తీవ్రంగా శ్రమిస్తున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

TeluguStop.com - కొడుకు శవం కోసం 41 రోజులుగా తండ్రి అన్వేషణ.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

గతనెల కేరళలోని మున్నార్ ప్రాంతంలో కొండచరియలు విరిగి దాదాపు 70 మందిని బలి తీసుకున్న విషయం తెలిసినదే.అయితే ఇప్పటి వరకు 66 శవాలను వెలికి తీశారు.

మిగిలిన నాలుగు శవాల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి ఎంతో ప్రయత్నం చేశారు.కానీ ఫలితం దక్కలేదు.

దీంతో అందరూ వదిలేశారు.కానీ మున్నార్ ప్రాంతం లోని, ఎంజీ కాలనీలో నివాసముంటున్న షణ్ముగ నాథన్ అనే వ్యక్తి మాత్రం వదల్లేదు.

ఎందుకంటే ఆ ఘటనలో తన కొడుకు దినేష్ కుమార్(22) కూడా చనిపోయాడు.

ఆరోజు ఆ ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటనలో షణ్ముగ నాథన్ తన ఇద్దరు కుమారులు దినేష్, నితీష్లతో పాటు మొత్తం 22 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ టీంలో తన చిన్న కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు ఆచూకీ లభించింది.అయితే తన పెద్ద కుమారుడు దినేష్ కుమార్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తన కుమారుడు బ్రతికే ఉంటాడు అని ఆశతో ఆ తండ్రి నిరంతరం కృషి చేస్తూ ఆ కొండ చరియలు తవ్వుతూ ఉన్నాడు.

తను నివసిస్తున్న ఎంజి కాలనీ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి ప్రతిరోజు వెళ్లి కొండను తవ్వుతూ తన కుమారుడి కోసం వెతుకుతున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న సబ్ కలెక్టర్ దేవికులం అతడికి సహాయంగా ఎర్త్ మూవర్స్ ను కూడా అందుబాటు చేశారు.

రోజు దాని సాయంతో తన కొడుకు ఆచూకీ కోసం గాలిస్తున్న కూడా ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు.అయితే అతను మాత్రం తన కుమారుడి ఆచూకీ దొరికేంతవరకు ఈ అన్వేషణ ఇలాగే కొనసాగుతుందని ఆ తండ్రి తెలిపాడు.

దీంతో ప్రస్తుతం షణ్ముగ నాథన్ ఇంకా అతని కుటుంబ సభ్యుల సహాయంతో ప్రతిరోజు ఆ కొండను తవ్వుతూ ఉన్నాడు.

#Sons Body #Father #Landslide Site #Kerala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Father Returns To Kerala Landslide Site Daily To Search For His Sons Body Related Telugu News,Photos/Pics,Images..