క‌న్న‌తండ్రే కామాంధుడై.. కూతురు, కొడుకు ప‌ట్ల దారుణం..!

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.లోకంలో ఉన్న చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు.

 Father Rapes Daughter With His Friend-TeluguStop.com

కొంత మంది చూడడానికి ఎంతో డీసెంట్ గా పైకి కనిపించినా… వారు ఇతరుల పట్ల ప్రవర్తించే తీరు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది.తమ వాళ్లు పరాయి వాళ్లు అని ఏ మాత్రం ఆలోచించకుండా దారుణాలకు ఒడిగడుతూ కటకటాల పాలవుతున్నారు.

అన్యం పుణ్యం తెలియని వారిని తీవ్రంగా వేధిస్తున్నారు.ఇలా హైదరాబాద్ లో ఏకంగా ఓ కన్న తండ్రే తన కూతురు, కొడుకు కామ వాంఛతో అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 Father Rapes Daughter With His Friend-క‌న్న‌తండ్రే కామాంధుడై.. కూతురు, కొడుకు ప‌ట్ల దారుణం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సదరు వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం హైదరాబాద్ లోని రిచ్ ఏరియా జూబ్లీహిల్స్‌ లో నివాసం ఉంటున్నాడు.

ఇతనికి 2003లోనే హైదరాబాద్ లోని వెంకటగిరికి చెందిన ఓ మహిళతో వివాహం అయింది.వివాహం అనంతరం దంపతులిద్దరూ అమెరికాలో నివాసం ఉన్నారు.కానీ కొన్నాళ్లకు 2010లో తిరిగి వచ్చి హైదరాబాద్ లోని సెటిల్ అయ్యారు.అలా వీరికి ఓ కుమారుడు, ఓ కూతురు కూడా ఉంది.

కానీ విధి వక్రీకరించడంతో వీరిరువురూ 2018లో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు.కానీ కొన్నాళ్ల నుంచి తన కూతురు, కుమారుడు దిగాలుగా ఉండడం చూసిన ఆ తల్లి వారిద్దరినీ సైకాలజిస్ట్ దగ్గరుకు వైద్యానికి తీసుకుపోయింది.

ఇలా తీసుకుపోయిన ఆమెకు షాకింగ్ నిజాలు తెలిసాయి.తన కూతురు మీద తన భర్త, అతని స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిసి షాక్ కు గురైంది.

అంతే కాకుండా తన కుమారుడిని కూడా నగ్నంగా చేసి వేధించాడని తెలుసుకున్న ఆ మహిళ వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించింది.పోలీసులు ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

#FatherRapes #JublieeHills #FatherRapes #Rape Attempt #Father Crime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు