కూతుర్ని రేప్‌ చేశాడు ఆ మృగాడు..తర్వాత అతని భార్య ఏం చేసిందో తెలుసా.?     2018-07-23   12:16:44  IST  Sai Mallula

దేశంలో మృగాళ్లు పెరిగిపోయారు. అడ్డూ అదుపూ లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఎన్ని కఠిన చట్టాలను తెచ్చినా వారి ఆగడాలకు మాత్రం అడ్డు అదుపు ఉండడం లేదు. వావి వరుస మరిచిపోయి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమిళనాడులోనూ ఓ తండ్రి ఇలాగే మృగాడిగా ప్రవర్తించాడు. మానసిక వికలాంగులారైన తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడు. ఈ క్రమంలో నిందితుడి భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆ వ్యక్తికి చనిపోయే వరకు జైలు శిక్ష విధించారు.

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతని వయస్సు 50 ఏళ్ళు. అతనికి 17 ఏళ్ళ కూతురు ఉంది. ఆమె మానసిక వికలాంగురాలు. అయితే ఆ వ్యక్తికి ఏం కన్ను కుట్టిందో తెలియదు కానీ.. తన కూతురిపైనే కన్నేశాడు. ఈ క్రమంలో సుబ్రమణి తరచూ తన కూతురిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఒకరోజు తల్లి ఆలయానికి వెళ్ళిన సమయంలో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత పలుమార్లు కూడ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆ బాధితురాలు అసలు విషయాన్ని చెప్పేందుకు భయ పడింది.

Father Raped On Daughter In Thanjavur-

Father Raped On Daughter In Thanjavur

అలా ఆ వ్యక్తి తన కూతురిపై అనేక సార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భవతి అయింది. గత ఏడాది మార్చిలో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తన కూతురును తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అయితే వైద్యులు బాధితురాలిని పరీక్షించి గర్భవతిగా తేల్చేశారు. ఈ క్రమంలో బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలిని తల్లి నిలదీసింది. దీంతో అసలు విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. తన భర్తే తన కూతురును గర్భవతిని చేశాడని తెలిసి ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సుబ్రమణిని అరెస్టు చేశారు.

అలా సుబ్రమణి అరెస్టు అయ్యాక ఈ కేసుపై విచారణ ఏడాదిపాటు కొనసాగింది. ఈ క్రమంలో తాజాగా తీర్పు వచ్చింది. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన సుబ్రమణిపై తంజావూరు మహిళా కోర్టు ఏడాది పాటు విచారణ చేసింది. ఈ మేరకు నిందితుడిపై ప్రాసిక్యూషన్ అభియోగాలను నిరూపించడంతో కోర్టు నాలుగు జీవిత ఖైదులను విధిస్తూ తీర్పును వెలువరించింది. జీవిత ఖైదులతో పాటు బెదిరింపులకు పాల్పడినందుకు ఆరు మాసాల పాటు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి బాలకృష్ణన్ తీర్పు వెలువరించారు. చనిపోయేవరకు శిక్షను అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది. అయినా.. ఇలాంటి వెధవలకు ఆ శిక్షలు కాదు, మరోలా కఠినంగా శిక్ష వేస్తే తప్ప.. ఇలాంటి ఘటనలు ఆగవు..!