పాకిస్తాన్ లో దారుణం : కేవలం యువకుడితో సన్నిహితంగా మాట్లాడారని ఇద్దరు కూతుళ్లను …  

Father Killed His Two Daughters For Prestige Issue In Pakistan - Telugu Crime News, Father Killed His Two Daughters, Honer Killing, Pakistan, Prestige Issue

ప్రస్తుత కాలంలో కొందరు అవగాహన లేకుండా పరువు పేరుతో తమ కడుపున పుట్టిన వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.తాజాగా ఓ యువకుడితో స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇద్దరు కూతుళ్లు సన్నిహితంగా మెలుగుతున్నారని ఏకంగా కన్న తండ్రే కాల యముడుగా మారి  దారుణంగా హత్య చేసిన ఘటన ఇస్లామిక్ దేశాల్లో ఒకటైనటువంటి పాకిస్థాన్ దేశంలో వెలుగు చూసింది.

 Father Killed His Two Daughters For Prestige Issue In Pakistan

వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. అయితే ఈ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు సంతానం.

కాగా ఈ వ్యక్తి ఇద్దరి కూతుర్లు గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో కొంతమేర సన్నిహితంగా మెలిగేవారు.ఈ క్రమంలో యువకుడితో కలిసి ఇద్దరు యువతులు ఓ వీడియోలో నటించారు.

పాకిస్తాన్ లో దారుణం : కేవలం యువకుడితో సన్నిహితంగా మాట్లాడారని ఇద్దరు కూతుళ్లను …-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో ఈ మధ్యకాలంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ విషయం తెలుసుకున్నటువంటి యువతుల తండ్రి మరియు సోదరుడు ఆగ్రహానికి గురయ్యారు.

అయితే ఈ ఆగ్రహంలో ఆ కన్నతండ్రి యువతులు తమ కూతుళ్లనే  విషయాన్ని కూడా మరచిపోయి ప్రవర్తించాడు.ఈ క్రమంలో తాను నివాసం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతానికి  ఇద్దరి కూతుళ్ళని  దూరంగా తీసుకెళ్లి కాల్చి హత్య చేశారు.

అనంతరం ఏమీ ఎరగనట్లు ఇంటికి వచ్చారు.అయితే పోలీసులు ఇద్దరి యువతుల తల్లిదండ్రుల ప్రవర్తన పై అనుమానం రావడంతో తండ్రి మరియు సోదరుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్న కారణంగా తన కూతుళ్ళని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Father Killed His Two Daughters For Prestige Issue In Pakistan Related Telugu News,Photos/Pics,Images..