కన్నతల్లి ఎదుటే పసిబిడ్డ ను చంపిన కిరాతక తండ్రి..  

father killed his baby infront of wife, father killed, his own children, infront of his wife, breathing issue, ysr district - Telugu Breathing Issue, Father Killed, His Own Children, Infront Of His Wife, Ysr District

అభం శుభం తెలియని పసి పిల్లలను ఎందరో దుర్మార్గులు కడ తేరుస్తున్న సమాజం ఇది.నేటి సమాజంలో ఆడపిల్లలకు అసలు రక్షణ అనేదే లేకుండా పోతుంది.

TeluguStop.com - Father Killed His Baby Infront Of Wife

ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు.ఇలా ఎన్నో నేరాలు చేస్తూ సరైన శిక్ష పడకుండా కాలాన్ని గడుపుతున్నారు నీచులు.

ఇటీవలే ఓ కసాయి కన్న తండ్రి తన బిడ్డను చంపిన ఘటన చోటు చేసుకుంది.

TeluguStop.com - కన్నతల్లి ఎదుటే పసిబిడ్డ ను చంపిన కిరాతక తండ్రి..-General-Telugu-Telugu Tollywood Photo Image

వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల కు చెందిన బాల్ రెడ్డి.ప్రకాశం జిల్లా మార్కాపురం కి చెందిన లక్ష్మి తో సహజీవనం చేస్తున్నాడు.2 నెలల క్రితం లక్ష్మి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.వీళ్లు ప్లాస్టిక్ కాగితాలు, బాటిళ్లు విక్రయిస్తూ, వ్యవసాయ కూలీ పనిచేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు.నాలుగు మాసాల క్రితం వీళ్లు జూపాడుబంగ్లా బస్టాండ్ సమీపంలో కేసీ కాల్వ విశ్రాంతి భవనం ప్రాంగణం లో నివాసముంటున్నారు.కాగా ఆ భవనంలో లక్ష్మి తన బిడ్డతో విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో తన భర్త బాల్ రెడ్డి మద్యం సేవించిన మైకంలో సోమవారం రాత్రి లక్ష్మీ తో వాదనకు దిగాడు.‘ నన్ను ఎందుకు వద్దంటున్నావు ఒక్కసారి చెప్పు’ అంటూ లక్ష్మీ తో గొడవ పడుతున్న సమయంలో తన చేతిలో ఉన్న తన బిడ్డను లాక్కొని పైకి ఎత్తి కింద పడేశాడు.

అంతేకాకుండా ఆ పసి బిడ్డ నోట్లో ఊపిరాడకుండా నోట్లో పాల డబ్బాను కుక్కాడు ఆ నీచ తండ్రి.దీంతో ఊపిరి ఆడని ఆ పసిపాప క్షణంలో గాలిలో కలిసిపోయింది.

దీంతో తన కళ్ళ ఎదుట తన బిడ్డ చావు ని చూసిన అతని తట్టుకోలేక కన్నీరుమున్నీరైంది.కాగా మరుసటి రోజు ఉదయం ఆ పసి పాప మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు ఆ కసాయి తండ్రి స్మశాన వాటిక దగ్గరకు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.

దీంతో వెంటనే పోలీసులు ఆ కసాయి తండ్రి ను అదుపులోకి తీసుకొని.పసిపాప మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

#Breathing Issue #Ysr District #InfrontOf #Father Killed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు