కుక్కల బోన్‌లో 20 నెలల పాపను పెట్టిన తండ్రి... భార్యపై కోపంతో వీడు చేసిన పనికి ఉరి తీయాలి  

Father Kept Daughter In Dog Cage-china,daughter,dog Cage,father,కుక్కల బోన్‌,జుటింగ్‌ పోలీసుల

జంతువులకు సైతం తమ కన్న పిల్లలపై ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను కడుపులో చూసుకోవాల్సి ఉంటుంది. కాని కొందరు తల్లిదండ్రులు మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తారు..

కుక్కల బోన్‌లో 20 నెలల పాపను పెట్టిన తండ్రి... భార్యపై కోపంతో వీడు చేసిన పనికి ఉరి తీయాలి-Father Kept Daughter In Dog Cage

కొందరు తల్లులు పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే, కొన్ని చోట్ల తండ్రులు పిల్లల విషయంలో అమానుషంగా వ్యవహరిస్తారు. ఇలాంటి సంఘటనలు దేవుడి దయ వల్ల ఇండియాలో ఎక్కువగా జరగడం లేదు. తాజాగా చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

20 నెలల పాపను తండ్రి చిత్ర హింసలు చేస్తున్నాడు. ఆ పాప తల్లి తనను వదిలి వెళ్లి పోయినందుకు ఆ పాపకు తండ్రి నరక చూపిస్తున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. జు టింగ్‌ కొన్ని నెలల క్రితం భర్త నుండి విడిపోయింది.

ఆ సమయంలో తన 20 నెలల పాపను భర్త వద్దే ఉంచేసింది. భర్త వద్ద ఆ పాప బాగానే పెరుగుతుందని ఆమె భావించింది. కాని కొన్ని రోజులుగా మాజీ భర్త నుండి కొన్ని ఫొటోలు మరియు వీడియోలు వస్తున్నాయి. ఆ ఫొటోలు మరియు వీడియోల్లో కూతురును అత్యంత దారుణంగా హింసించడంతో పాటు ఏకంగా కుక్కలను బంధించే బోనులో వేసి ఉంచాడు..

కుక్కలకు వేసినట్లుగా ఒక బౌల్‌లో బోజనం పెడుతూ అప్పుడప్పుడు వాటర్‌ ఇస్తూ కుక్క మాదిరిగా చూస్తూ ఉన్నాడు.

అంతే కాకుండా ఆ చిన్నారి చేతిపై, కాళ్లపై కోసిన గాట్లు మరియు కాలిన గాట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా క్లోజప్‌ ఫొటోలు తీసి మరీ తన భార్యకు పంపి కసిగా నవ్వేవాడట. ఈ విషయాన్ని జుటింగ్‌ పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లింది.

మీడియాలో ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది. దాంతో పాటు అతడి వల్ల ఇబ్బంది పడ్డ పాపను జు టింగ్‌కు అప్పగించారు. పాప చాలా గాయాలతో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది..

ప్రస్తుతం పాప చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.