సంథింగ్ స్పెషల్: తప్పిపోయిన కొడుకు పచ్చబొట్టు సాయంతో తండ్రి దగ్గరకు చేరాడు.ఇంతకీ ఆ పచ్చబొట్టులో ఏముందో తెలుసా

షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ తో బాదపడే వాళ్లు.తాము మర్చిపోయే విషయాల్ని గుర్తు పెట్టుకోవడానికి కొన్ని పద్దతులు పాటిస్తుంటారు.

 Father Gets Short Term Memory Son In Mumbai Through Tattoo-TeluguStop.com

మనం ఆ మధ్య చూసిన గజిని సినిమా ఆ కోవకు చెందిందే.అందులో హీరో అయిన సూర్య.

తన శత్రువుల అందరి పేర్లను ,ఫోన్ నంబర్లను ఒంటిపై పచ్చబొట్లుగా వేయించుకుని ,పదే పదే గుర్తుకు తెచ్చుకుంటుంటాడు.ఇదే విషయాన్ని ఫాలో అయ్యాడు ముంబైకి చెందిన ఒక తండ్రి.ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

ముంబాయికి చెందిన వెంకన్న కుమారుడు శివకు షార్ట్ టర్మ్ మెమరీలాస్ ఉంది.దీంతో అతన్ని దివ్యాంగుల పాఠశాలలో చేర్పించాడు వెంకన్న.రోజులానే శివ మంగళవారం వ్యానులో పాఠశాలకు వెళ్లాడు.స్కూల్‌ ముందు బస్సు దిగిన శివ,స్కూల్లోకి వెళ్లడం మర్చిపోయి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.చివరికి జీటీబీఎన్‌ రైల్వే స్టేషన్ వద్దకు చేరాడు.అక్కడికి వెళ్లాక ఎటుపోవాలో తెలియని అయోమయ స్థితలో ఉన్న శివను స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు… అనుమానాస్పద స్థితిలో తిరిగుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్టేషన్ కి తీస్కెళ్లి ఆరా తీస్తే శివ ఏ ప్రశ్నకి సమాధానం సరిగా చెప్పట్లేదు.దాంతో ఏం చేయాలా అనుకుంటున్న పోలీసులకు శివ చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న ఫోన్ నంబర్ కనపడింది.వెంటనే తండ్రి వెంకన్నకు ఫోన్ చేశారు.విషయం తెలుసుకున్న వెంకన్న కుమారుడి దగ్గరికి వెళ్లాడు.గతంలో శివ మర్చిపోయి చాలా సార్లు ఇలా వెళ్లిపోయేవాడు.వెతకడానికి నానా ప్రయాసలు పడేవాడు వెంకన్న.

అయితే వెంకన్న స్నేహితుడు ‘గజిని’ సినిమా చూసి శివ చేతిపై ఫోన్ నంబరును పచ్చబొట్టు వేయించమని సలహా ఇవ్వడంతో… ఆ సలహా పాటించాడు వెంకన్న.అప్పటినుండి ఒకవేళ పొరపాటున కుమారుడు తప్పిపోయినా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారనే ధీమాతో ఉంటున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube