కామాందుడైన తండ్రికి..కోర్టు 4 జీవిత ఖైదులు..సంచలనం రేపుతున్న తీర్పు

తమిళనాడులో మహిళా కోర్టు సంచలన తీర్పు ప్రకటించి.కన్న కూతురు అని మరిచిపోయి మరీ కూతురినే చెర బట్టి గర్భవతిని చేసిన తండ్రికి చచ్చే వరకూ జైలు జీవతం గడపాలి అంటూ 4 జీవిత ఖైదుల శిక్షని ఖారారు చేసింది.

 Father Daughter Rape Arrested-TeluguStop.com

ఈ తీర్పు తమిళ నాట సంచలనం రేపుతోంది.వివరాలలోకి వెళ్తే

వావి వరుసలు మర్చిపోయి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు అనేకం కానీ తన కన్న పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఒక ఆడపిల్లని ఒక తండ్రి కామంతో చూశాడు.కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.తమిళనాడులోని తంజావూరు జిల్లా శివకొల్లై ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

అతను తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని హెచ్చరించాడు.

మానసిక వికలాంగురాలు అయిన ఆమెపై తరుచూ అత్యాచారానికి పాల్పడేవాడు.ఒకరోజు తల్లి ఆలయానికి వెళ్ళిన సమయంలో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు తర్వాత పలుమార్లు కూడ బాధితురాలిపై అత్యాచారం చేశాడు.

ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని హెచ్చరించాడు.దాంతో ఈ విషయం ఆమె ఎవ్వరికీ చెప్పకుండా ఉండిపోయింది.అయితే
గత ఏడాది మార్చిలో తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మానసిక వికలాంగురాలైన కూతురును తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళింది.వైద్యులు బాధితురాలిని పరీక్షించి గర్భవతిగా తేల్చేశారు.

బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది.దీంతో బాధితురాలిని తల్లి నిలదీసింది.

దీంతో అసలు విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది…దాంతో భర్త సుబ్రమణిపై పట్టుక్కోట్టై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.బాధితురాలి తల్లి పిర్యాదు మేరకు పోలీసులు సుబ్రమణిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు.దాంతో విచారణ చేపట్టిన పోలీసులు అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించారు దాంతో న్యాయమూర్తి బాలకృష్ణన్ తీర్పు వెలువరించారు.

కామాందుడైన తండ్రికికోర్టు 4 జీవిత ఖైదులుసంచలనం రేపుతున్న తీర్పు -

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube