లూడో గేమ్ లో చీటింగ్.. తండ్రిని కోర్టుకీడ్చిన కూతురు..!  

Daughter Filed case against Father For cheating in Ludo game, Ludo game, Daughter , Father Cheats in ludo Game, online Game Effect, parents, Family Court - Telugu Daughter Filed Case Against Father For Cheating In Ludo Game, Family Court, Father Cheats In Ludo Game, Ludo Game, Madyapradesh, Online Game Effect, Parents

లూడో గేమ్ ఆడుతుండగా చీట్ చేశాడని ఓ కూతురు తన తండ్రిని కోర్టుకు ఈడ్చింది.ఇలాంటి విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటు చేసుకుంది.

TeluguStop.com - Father Cheats Ludo Game Daughter Filed Case Family Court

తండ్రికి వ్యతిరేకంగా ఆ యువతి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.ఈ మేరకు యువతి ఫిర్యాదును స్వీకరించిన ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ ఇప్పించారు.24 ఏళ్ల యువతి తెలిపిన వివరాల ప్రకారం.తండ్రితో కలిసి లూడో గేమ్ ఆడుతుండగా, తప్పుగా ఆడి తనను చీట్ చేశాడని ఆరోపించింది.

దీంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు.తాను నమ్మిన తండ్రే మోసం చేయడంపై భరించలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని ఆ యువతి పేర్కొంది.

TeluguStop.com - లూడో గేమ్ లో చీటింగ్.. తండ్రిని కోర్టుకీడ్చిన కూతురు..-General-Telugu-Telugu Tollywood Photo Image

కూతురు మాట్లాడుతూ… ‘‘నా తండ్రిపై నేను ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నా.ఇద్దరం కలిసి లూడో గేమ్ ఆడుతున్నప్పుడు నా తండ్రి తప్పుగా ఆడి నన్ను చీట్ చేశాడు.

నా తండ్రి చేసిన మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.నేను గేమ్ సరిగ్గా ఆడుతున్నా.

నా తండ్రి మంచిగా ఆడలేదని, మొత్తం చీటింగ్ చేస్తు గేమ్ ని ఆడాడు.అందుకే ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేయడానికి వచ్చాను.

’’ అని యువతి పేర్కొంది.కోర్టు కౌన్సిలర్ మాట్లాడుతూ.

‘‘ ఇప్పటికే ఆ యువతికి నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇప్పించాం.ప్రస్తుతం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము.

ఈ మధ్యకాలంలో పిల్లల మనస్తత్వంలో చాలా మార్పులు వస్తున్నాయి.గేమ్ ఆడేటప్పుడు తండ్రి ఓడిపోతే బాగుండేది.

ప్రస్తుతం యువతపై ఆన్ లైన్ గేమింగ్ ప్రభావం ఎక్కువగా ఉంది.వీలైనంత వరకూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

యువతికి నాలుగు రౌండ్లు కౌన్సిలింగ్ ఇప్పించిన అనంతరం పాజిటివ్ గా మాట్లాడింది.’’ అని పేర్కొన్నారు.

#Family Court #Parents #FatherCheats #DaughterFiled #Madyapradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Father Cheats Ludo Game Daughter Filed Case Family Court Related Telugu News,Photos/Pics,Images..