అప్పు చేసిన తండ్రి.. మనస్తాపంతో కూతురు ఆత్మహత్య..

కళాశాల ఫీజు కోసం తండ్రి అప్పు చేయడంతో మనస్తాపంతో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల మేరకు వనపర్తి పట్టణంలోని హరిజనవాడ కు చెందిన లావణ్య హైదరాబాద్ లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది.

 Father Borrowed Money For Daughters Education Who Got Suicide In Wanaparthi-TeluguStop.com

ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులు వింటుంది.ఆమె తండ్రి వెంకటయ్య  కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యాలయలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలిపని చేస్తూ కూతుర్ని, కుమారుని చదివిస్తున్నారు.

వారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది దీంతో ఆయన 8 వేలు రూపాయలు తెచ్చి ఇచ్చి పనికి వెళ్ళాడు.తల్లి, తమ్ముడు కూడా బయటికి వెళ్లారు.

 Father Borrowed Money For Daughters Education Who Got Suicide In Wanaparthi-అప్పు చేసిన తండ్రి.. మనస్తాపంతో కూతురు ఆత్మహత్య..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Btech Second Year, Daughter Education, Father Borrowed Money, Father Venkatayya, Lavanya, Student Suicide In Wanaparthi, Suicide In Wanaparthi-Latest News - Telugu

ఈ క్రమంలో తమ కుటుంబం ఆర్థిక పరిస్థితిని చూసి మనస్థాపానికి గురైన లావణ్య మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది.కొద్దిసేపటికి స్థానికులు సూచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#Lavanya #StudentSuicide #SuicideIn #FatherBorrowed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు