టెక్సాస్ లో ఓ తండ్రి ఘాతుకం..  

Father Attacks To Daughter In Texas-nri,telugu Nri News Updates,us Crime

టెక్సాస్ లో ఓ తండ్రి తన కన్నా కూతురిని విచక్షణా రహితంగా తలపై సుత్తితో మోది చంపేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ఈ ఘటన అక్కడి స్థానికులని భయాందోళనలకి గురిచేస్తోంది. ఎందుకు ఆ తండ్రి అలా చేశాడు...

టెక్సాస్ లో ఓ తండ్రి ఘాతుకం..-Father Attacks To Daughter In Texas

చంపిన తరువాత ఆ పాపని ఏమి చేశాడు అనే వివరాలలోకి వెళ్తే.

అప్పటి వరకూ తనపక్కనే టీవీ చూస్తూ కూర్చున్న తన పాపతో కబుర్లు చెప్తూనే ఉన్నాడు కాని ఒక్క సారిగా ఏమయ్యిందో ఏమో తెలియదు కాని సోఫా లోనుంచీ లేచి స్టోర్ రూమ్ లోకి వెళ్లి సుత్తి తీసుకుని ఒక్క సారిగా ఆ పాపపై దాడి చేశాడు అంతేకాదు చనిపోయే వరకూ సుత్తితో కొడుతూనే ఉన్నాడట.

ఆ పాప చనిపోయిందని నిర్దారణ చేసుకున్న తరువాత శవాన్ని తీసుకుని వెళ్లి బెడ్ రూంలోని ఓ బీరువాలో దాచేశాడు..

చనిపోయే సమయంలో ఆ పాప పెట్టిన ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఇంటికి చేరుకున్న పోలీసులు. వంటిపై నూలు పోగు కూడా లేకుండా కూర్చున్న అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.

ఇల్లు మొత్త గాలించిన అధికారులు చివరికి పాప మృతదేహాని గుర్తించి కేసుని నమోదు చేసుకున్నారు…అయితే ఈ హత్య కావాలని చేయలేదని ఈ హత్య చేసే సమయంలో నా శరీరం నా అదుపులో లేదంటూ యోవానిస్ వింత వాదన చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కన్న కూతురిని చంపిన తండ్రికి మరణ శిక్ష లేకపోతె యావజ్జీవం పడే పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.