యూట్యూబ్​ చూసి మద్యం తయారీ చేసిన తండ్రీకొడుకులు.. దాంతో..?!

లాక్ డౌన్ కారణంగా బయట మద్యం దొరకడం లేదని ఓ తండ్రీ కొడుకులు యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే మద్యం తయారు చేయడం ప్రారంభించారు.మొదట్లో వారి కోసమే తయారు చేసుకున్నా ఆ తర్వాత ఇతరులకు కూడా అమ్మడం మొదలెట్టారు.

 Father And Son Who Made Alcohol By Watching Youtube  With That  Youtube, Liqour,-TeluguStop.com

దీంతో పోలీసులకు సమాచారం అందింది.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.

ఈ ఘటన తమిళనాడులోని కరూర్​ జిల్లా జరిగింది.

వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కరూర్​ జిల్లా కుప్పుచ్చిపాలయంలో గుణశేఖరన్ అనే వ్యక్తి తన కొడుకు జగదీశ్ ​తో కలిసి ఇంట్లోనే సొంతంగా మద్యం తయారు చేయడం మొదలెట్టాడు.

యూట్యూబ్ లో చూసి మద్యం తయారుచేయడం నేర్చుకున్నారు.ముందుగా తమ కోసం మాత్రమే మద్యం తయారీ ప్రారంభించిన ఆ తండ్రీ కొడుకులు ఆ తర్వాత ఇతరులకు అమ్మడం స్టార్ట్ చేశారు.

దీంతో పోలీసులకు సమాచారం వెళ్లింది.పోలీసులు రంగంలోకి దిగి రైడ్ చేస వారి వద్ద ఉన్న 8 లిక్కర్​ బాటిళ్లు, మద్యం తయారీకి వాడే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలో లాక్ ​డౌన్​ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇలా ఇంట్లో మద్యం తయారీ, అక్రమ వినియోగం పెరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

Telugu Prepared, Son, Tamilnadu, Youtube-Latest News - Telugu

కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు.దీంతో మందు బాబులకు మద్యం కొరత ఏర్పడింది.తమకు అవసరం ఉన్న సమయంలో మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో కొందరు ఇంట్లోనే మద్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు.

ఇలా మద్యాన్ని తయారు చేస్తున్న వారు ఈ ఇద్దరే కాదని, గతనెల 10న తమిళనాడు రాష్ట్రంలో లాక్​ డౌన్​ విధించినప్పటి నుంచి ఇంట్లో మద్యం తయారీ చేసే వారి సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు.ఇక ఈ మధ్య యూట్యూబ్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది.

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు యూట్యూబ్ ను వాడుతున్నారు.కొంతమంది వినోదం కోసం వాడుతుండగా, కొంతమంది కొత్త కొత్తవి యూట్యూబ్ వీడియోల్లో చూసి నేర్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube