స్కూల్ ఫీజు అని అబద్దం చెప్పి...తండ్రి డబ్బులతో సినిమాకెళ్ళాడు.! తర్వాత ఏమైందో తెలుస్తే కన్నీళ్లే.!  

Father And Son Love Emotional Story-father And Son,relations Ships

"Nannu, tomorrow we have to pay a test fee in our classroom," the master said. Then the child who came home came to hear the son's words. What is the fees? He asked. Raghu said two hundred.
"Well, two hundred times this time has been greatly increased, and when Sirley goes to school tomorrow," he walks in the back yard. The next morning morning, Raghu was preparing to go to school, he said, 'Two hundred and fifty, please, do not give the teacher as soon as he goes.' Well, Raghu walked out and ran. Raghu had a long way and his friend Amar got into trouble. Have you paid your daddy fees? Amar asked for anxiety.

..

..

..

“నాన్నా! రేపు మా తరగతిలో పిల్లలంతా పరీక్ష ఫీజు చెల్లించాలని హెడ్ మాస్టర్ చెప్పారు” ఇంట్లోకి అడుగు పెడుతూనే అన్నాడు రఘు. అప్పుడే కూలిపని ముగించుకుని ఇంటికి వచ్చిన కేశవులు కొడుకు మాటలు విని ‘అలాగా! ఫీజు ఎంత ఏంటి? అని అడిగాడురెండు వందలని మెల్లగా చెప్పాడు రఘు..

స్కూల్ ఫీజు అని అబద్దం చెప్పి...తండ్రి డబ్బులతో సినిమాకెళ్ళాడు.! తర్వాత ఏమైందో తెలుస్తే కన్నీళ్లే.!-Father And Son Love Emotional Story

“అవునా! రెండు వందలా ఈసారి బాగా పెంచేశారు , సర్లే రేపు బడికి వెళ్ళినపుడు ఇస్తాను” అంటూ పెరట్లోకి నడిచాడు కేశవులుమరుసటి రోజు ఉదయం రఘు బడికి వెళ్లేందుకు తయారవుతుండగా ‘ఇదిగోరా రెండువందలు, జాగ్రత్త మరి , వెళ్లినవెంటనే టీచర్ కి ఇవ్వు’ అని జేబులో పెట్టాడు. సరే నాన్న అంటూ బయటకు నడిచాడు రఘు. రఘు కాస్త దూరం నడవగానే అతని స్నేహితుడు అమర్ ఎదురయ్యాడుఏరా మీ నాన్న ఫీజు డబ్బులు ఇచ్చారా ? ఆతృతగా అడిగాడు అమర్.

ఇచ్చారురా మరి , మీ నాన్న ? అమర్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు రఘు.

తల్లిదండ్రుల్ని నమ్మించి భలేగా డబ్బులు తీసుకున్నామని ఇద్దరూ మురిసిపోయారు. చెరో వంద వారి తరగతి ఉపాధ్యాయుడికి ఫీజు చెల్లించారు.

మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరూ ఆడుకోవడానికి అని ఇంట్లో చెప్పి టౌనుకు బయలుదేరారు.

సినిమా చూసి, ఆ తరువాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తినుబండారాలు ఎన్నో కొనుక్కుని తిన్నారు. ఆనందంగా గడిపారు, చీకటిపడే వేళకు ఇంటికి చేరుకున్నారు. రఘు ఆట నుంచి ఇంటికి వస్తున్నట్టు నమ్మించేందుకు ఒక క్రికెట్ బాట్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.

అదే సమయంలో పక్క గదిలో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విని ఆగిపోయాడు.

కిటికీలోంచి లోపలకు చూసాడు, వాళ్ల నాన్న మంచం మీద జ్వరంతో వనికిపోతూ ఉన్నాడు. అతని భార్య సపర్యలు చేస్తూ ” వచ్చిన డబ్బులన్ని పిల్లాడు ఫీజు కోసం ఇచ్చేశావ్, మందులు తెద్దామంటే ఇంట్లో రూపాయి కూడా లేదు” అంది.

నాకు మాములు జ్వరమెగా వచ్చింది రేపటికి తగ్గిపోతుందిలే అన్నాడు మూలుగుతూ

అలా అంటే ఎలా నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఒక యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను, అంటూ లేవబోయిన ప్రమీల చేయి పట్టుకుని ఆపి వద్దు రేపు చూద్దాంలే ఇప్పుడు అప్పు చేయడం ఎందుకు అన్నాడు కేశవులు.
తన ఫీజుకోసం ఉన్న డబ్బులన్ని ఇచ్చిన తండ్రి మంచితనాన్ని తలుచుకోగానే దుఃఖం తన్నుకు వచ్చింది..

గదిలోకి పరుగున వెళ్లి తండ్రిని అమాంతం కౌగిలించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పాడు.

తప్పును క్షమించమని విలపించాడు. వాస్తవాన్ని చెప్పినందుకు రఘుని తల్లిదండ్రులు కోపగించుకోలేదు.

పైగా “చూడు రఘు! నువ్వే మా సర్వస్వం. నీకోసం, నీ చదువు కోసం ఏమైనా చేస్తాం.

నువ్వు మాలా కూలి బ్రతుకు బ్రతకకూడదన్నదే మా కోరిక. జరిగింది మరిచిపో , ఇక మీద నీకేం కావాలన్న సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు మేము తెచ్చిపెడతాం. మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకు, అంటూ అక్కున చేర్చుకున్నారు.