జైలులో ఖైదీల నిరాహారదీక్ష.. దేనికో తెలుసా..?

ఐపీఎల్ ఫీవర్ ఎక్కడెక్కడో ఉన్న క్రికెట్ అభిమానులను ఎంజాయ్ చేసేలా చేస్తుంది.ప్రతి సీజన్ ఐపీఎల్ యువతకు ఒక మంచి ఎక్సయిటింగ్ కలిగేలా చేస్తుంది.

 Fatehgarh Central Jail Prisoners Hunger Strike For Ipl 2021 Matches Telecast-TeluguStop.com

సీజన్ సీజన్ కు ఫార్ములాలు మారడం.జట్ల మధ్య తీవ్రమైన ఫైట్.

ఐపీఎల్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజా ఇస్తుంది.అయితే ఈ జోష్ ఎవరు కావాలని కోరుకోరు చెప్పండి.

 Fatehgarh Central Jail Prisoners Hunger Strike For Ipl 2021 Matches Telecast-జైలులో ఖైదీల నిరాహారదీక్ష.. దేనికో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే తమకు ఐపీఎల్ ప్రసారాలు కల్పించాలని జైలులో ఉన్న ఖైదీలు కూడా కోరుతున్నారు.కోరడమే కాదు అందుకు నిరాకరించారని ఖైదీలు నిరాహార దీక్షకు దిగడం విశేషం.

ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.ఉత్తర్ ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో జరిగింది.

ఫతేగడ్ కేంద్ర కారాగారంలో ఖైదీలు తమకు ఐపీఎల్ ప్రసారాలు చూసేలా ఏర్పాటు చేయమని కోరారు.అయితే వారి కోరికని పెడ చెవిన పెట్టడంతో అక్కడ ఖైదీలంతా ఐపీఎల్ చూడాలని నిరాహారదీక్షకు దిగారు.

అలా నిరాహారాదీక్షకు దిగడంతో చేసేదేమి లేక జైలు అధికారులు అంగీకరించి ఐపీఎల్ చూసే సౌకర్యాన్ని కలిగించారు.అక్కడ జైలు సూపరింటెండెంట్ లఖ్ నవూలో అధికారులతో సమావేశమైనప్పుడు ఈ నిరసన తెలియడంతో వెంటనే జైలుకి వచ్చి వారికి ఐపీఎల్ చూసే ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది.

 జైలులో ఖైదీలను కూడా ఐపీఎల్ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

#Ipl 2021 #Hunger Strike #Khaidhis #PrisonersHunger #Uttarpradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు