భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
భద్రాచలం- విజయవాడ జాతీయ రహదారిపై దమ్మపేట సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాల్వంచ ఆస్పత్రికి తరలించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.